Political News

ట్విట్టర్ ట్రెండ్: మంత్రిగారూ అడ్మిషన్ ప్లీజ్

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. పెద్ద స్థాయిలో రెకమండేషన్ ఉంటే తప్ప బెడ్ దొరకడం లేదు. దొరికాక కొన్ని రోజులకే లక్షలకు లక్షలు ఎలా బిల్లులు వాయించేస్తున్నారో తెలిసిందే. ఐతే ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పటికీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందట్లేదని ఆందోళన చెందుతున్న పేషెంట్లు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఐతే ఇలా లాభం లేదని.. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం పొందుతున్న సామాన్య పేషెంట్లూ ఉంటున్నారు.

తమ పరిస్థితిని తెలియజేస్తూ.. మంత్రులతో పాటు కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల్ని ట్యాగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ ఇప్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఇలా మంత్రి హరీష్ రావును ఉద్దేశించి వీడియో పెట్టిన ఓ జర్నలిస్టు అపోలో ఆసుపత్రిలో బెడ్ సంపాదించాడు. మరో నెటిజన్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు విన్నవించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.

ఇలాంటి వాటిని టాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు హైలైట్ చేస్తుండటంతో అనారోగ్యం తీవ్రమవుతున్న కరోనా పేషెంట్లందరూ ఇక ఇదే బాట పడుతున్నారు. ఐతే సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి పని జరుగుతోంది కానీ.. దీనిపై అవగాహన, యాక్సెస్ లేని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.

This post was last modified on July 10, 2020 8:42 am

Share
Show comments
Published by
suman

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago