సుందరమైన నదీతీరం.. ఆటవిడుపు ప్రాంతాలకు నెలవు అయిన విశాఖ ఇప్పుడు.. రాజకీయ వ్యూహాల మధ్య చిక్కి.. నలిగిపోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇటు అధికార పార్టీ.. అటు ప్రతిపక్షాలు కూడా.. విశాఖ కేంద్రంగా చేస్తున్న రాజకీయాలు.. ఊహాతీతంగా మారిపోయాయి. విశాఖను రాజధాని చేస్తామని.. చెబుతున్న అధికార పార్టీ నేతలు.. కాదు.. ఏకైక రాజధానే ముఖ్యమంటున్న ప్రతిపక్షాలు విశాఖను కేంద్రంగా చేసుకుని.. ఉద్యమిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్యమాలతో సామాన్యులు నలిగిపోతున్నారనేది వాస్తవం. రెండు రోజుల ముందు నుంచే చేపట్టిన గర్జన హడావుడితో.. విశాఖ నగరం బోసిపోయింది. చిరు వ్యాపారులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
రెండు రోజుల ముందు నుంచే.. వ్యాపారాలను నిలిపివేసుకోవాలన్న.. పోలీసుల ఆంక్షలతో చిరు వ్యాపారులకు ప్రాణ సంకట పరిస్థితి ఎదురైంది. తీరా విశాఖ గర్జన ముగిసింది. అయితే.. ఈ గర్జన అనంతర పరిణామాలు.. విశాఖను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. గర్జన ముగిసి వెళ్తున్న మంత్రి వర్గంలోని సభ్యులపై జనసేన అభిమానులు కొందరు రాళ్లు రువ్వారని.. మంత్రులు ఆరోపిస్తున్నారు. అబ్బే అదేం లేదని.. జనసేన నేతలు చెబుతున్నారు. ఇదంతా నాటకమేనని అంటున్నారు. అయితే.. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు మరోసారి విశాఖను అష్టదిగ్భంధనం చేసేశారు. ఫలితంగా వరుసగా నాలుగోరోజు కూడా.. విశాఖలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
“రాజధాని మాటేమో.. కానీ, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. గర్జన కు రెండు రోజుల ముందు నుంచి మేం వ్యాపారాలు నిలిపివేసుకున్నాం. ఆదివారాలు వస్తే.. అంతో ఇంతో సంపాయించుకునే పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు పోయింది. ఇలా అయితే.. మేం ఎలా బతకాలి? పైగా పండగల సీజన్” అని సామాన్యులు రోదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని వచ్చిందా.. రాలేదా.. అనేది కాదు.. ప్రజల సాధారణ జీవనమే ప్రధానంగా సాగాల్సిన చోట.. నేడు పోలీసు వాహనాల సైరన్లు.. బూటు కాళ్ల చప్పుళ్లతో తీరప్రాంత జిల్లా అట్టుడుకుతోంది.
ఇక, ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రంగంలోకి దిగారు. జనవాణి నిర్వహించేందుకు ఆయన సమాయత్తమయ్యారు. వాస్తవానికి.. నిజం చెప్పుకోవాలంటే.. గర్జన ఉన్న విషయం ఆయనకు తెలిసినప్పుడు.. ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు వాయిదా వేసుకుంటే.. నగరంలో ఒకింత ప్రజలు ఊపిరి పీల్చుకునేవారు. కానీ, ఆయన దూకుడు ప్రదర్శించారు. ఇక, పవన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులు సైతం.. దురుసుగా వ్యవహరించారనే టాక్ ఉంది. వెరసి.. మొత్తంగా.. విశాఖ ఇప్పుడు అట్టుడుకుతోంది. దీంతో అంతిమంగా.. తమకు రాజధాని అవసరం లేదనే దిశగా ప్రజలు నిర్ణయించుకున్నా.. ఆశ్చర్యంలేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 16, 2022 10:33 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…