ఏదైనా ప్రయోగం చేస్తే.. ప్రయోజనం.. ఇట్టే ఊడిపడాలనే టైపులో రాజకీయ నేతలు ఉంటారు. మరి.. అలాంటి నాయకులే ఉన్న వైసీపీలో చేస్తున్న ప్రయోగాలు ఒక్కటి కూడా ఫలించడం లేదనేటాక్ వినిపిస్తోంది. పైగా.. ప్రయోగాలు.. అభాసు పాలవుతున్నాయని కూడా చెబుతున్నారు. గతంలో రాజధానికి వ్యతిరేకంగా.. అసెంబ్లీలో చేసిన తీర్మానం, తీసుకువచ్చిన చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సీఆర్డీఏను రద్దు చేస్తూ.. చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.
ఇది వైసీపీ హిస్టరీలో తొలి వెనుకడుగుగా భావించాల్సి ఉంటుంది. తర్వాత.. వరుస పెట్టి.. అన్నీ అభాసుపాలవుతూనే ఉన్నాయి. శాసన మండలి రద్దు చేయాలంటూ.. ఏకంగా.. రాత్రికిరాత్రి తీర్మానం చేసిన వైసీపీ.. తర్వాత.. దీనిని కూడా వెనక్కి తీసుకుని.. రద్దు చేయొద్దు మహప్రభో.. ! అంటూ.. కేంద్రం ముందు మోకరిల్లిన పరిస్థితి నెలకొంది. ఇక, తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా..ఎమ్మెల్యేలు.. మంత్రులు రాజీనామాల విషయం చర్చకు వస్తోంది.
ఇప్పటికే విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. వికేంద్రీకరణకు మద్దతుగా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను కూడా సై అంటున్నారు.. అవంతి శ్రీనివాస్. ఇక, మంత్రులు కూడా.. రాజీనామాలు సమర్పించేస్తాం.. అంటూ.. వాదన మొదలు పెట్టారు. అయితే.. ప్రస్తుతం ధర్మశ్రీ చేసిన రాజీనామా విషయం.. చర్చనీయాంశం అయింది. ఆయన స్పీకర్ ఫర్మాట్‌లో చేశానని చెబుతున్నా.. బయటకు వచ్చిన రిజైన్ లెటర్‌ను బట్టి.. ఆయన ఇక్కడేదో మతలబు ప్రయోగం చేశారనే వాదన వినిపిస్తోంది.
ఉద్దేశ పూర్వకంగా.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు.. ఒక ప్రయోగం చేశారు తప్ప.. వాస్తవం మాత్రం కాదని.. అంటున్నారు. ఎందుకంటే..రాజీనామా చేస్తే.. అది ఆమోదం పొందేలా ఉండాలి. కానీ, కరణం చేసిన రాజీనామా కేవలం కంటితుడుపు చర్చగా ఉందనేది పరిశీలకుల భావన. మొత్తానికి మూడు రాజధానుల విషయంలోనూ.. ప్రజలను మభ్య పెడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైసీపీ మరోసారి అభాసుపాలైందనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on October 11, 2022 2:52 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…