మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హ్యాండ్ ఇవ్వటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరిస్తారని కొందరు అంచనా వేసుకున్నారు. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకే కృషి చేస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
సరిగ్గా ఈ నేపధ్యంలోనే బాంబులాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆ బాంబు ఏమిటంటే తమ్ముడు, బీజేపీ అభ్యర్ధియిన రాజగోపాలరెడ్డి గెలుపుకే ఎంపీ సహకరించాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆ పనిని డైరెక్టుగా చేయలేరు కాబట్టి అసలు ఉపఎన్నికలకే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎంపీ ఏమి చేయబోతున్నారంటే ఏకంగా దేశంలోనే ఉండటంలేదట. ఈనెల 15వ తేదీన కుటుంబ సమేతంగా ఆస్ట్రేలియాకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.
తిరిగి హైదరాబాద్ కు వచ్చేది మునుగోడు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతేనట. మరి పాల్వాయి స్రవంతి గెలుపుకు కృషి చేస్తానని ఎంపీ ఇచ్చిన మాట విషయం గాలికి కొట్టుకుపోయినట్లే అనిపిస్తోంది. పాపం స్రవంతి ఎంపీ ప్రచారం చేస్తారని, తన గెలుపు ఖాయమని చాలా అమయాకంగా నమ్మింది. మూడు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో కూడా ఎంపి తన గెలుపుకు కృషి చేస్తారని గట్టిగా వాదించారు.
అభ్యర్థి అంతలా వాదించారంటే ఆమెను అంతలా మభ్యపెట్టినట్లు అర్ధమవుతోంది. అయినా తమ్ముడు బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తుంటే ఎంపీ సొంతపార్టీ అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తారని నమ్మిన నాయకులు ఎంతటి అమాయకులో అర్ధమవుతోంది. మొదటినుండి ఎంపీ వైఖరి అనుమానస్పదంగానే ఉంది. విచిత్రం ఏమిటంటే స్రవంతికి ఎంపీయే పట్టుబట్టి టికెట్ ఇప్పించారు. అంటే రేవంత్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ కన్నా స్రవంతి అయితే బలహీనంగా ఉంటుందని, ఈజీగా ఓడించచ్చని అంచనా వేసినట్లున్నారు. మొత్తానికి ఎంపీ కీలకసమయంలో హ్యాండివ్వటం ఖాయమని తేలిపోయింది.
This post was last modified on October 10, 2022 12:37 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…