రాహుల్ గాంధీ మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. కానీ అది మంచి కారణంతో కాదు. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. #sukanyarapistrahulgandhi.. ఇదీ ఆ హ్యాష్ ట్యాగ్. రాహుల్ గాంధీ ఏంటి.. రేప్ కేసు ఏంటి అనిపిస్తోందా? ఆయన మీద ఒక రేప్ కేసు ఉన్న మాట వాస్తవం. ఒకప్పుడు ఆ కేసు సంచలనం రేపింది. 13 ఏళ్ల తర్వాత గత ఏడాదే సరైన ఆధారాలు లేవంటూ ఆ కేసును కొట్టేసింది సుప్రీం కోర్టు. 2006లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా ఉత్తర ప్రదేశ్‌లో సుకన్య అనే అమ్మాయిని రాహుల్‌తో పాటు మరో ఏడుగురు కలిసి రేప్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి.
యూపీలో అప్పటికి సోనియా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలోని తన గెస్ట్ హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న రాహుల్.. తనకు అభిమాని అయిన పార్టీ కార్యకర్త బల్‌రామ్ సింగ్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నది ఆరోపణ. అందులో ఇద్దరు రాహుల్ స్నేహితులైన బ్రిటిష్ వ్యక్తులు కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ కేసులో నిజాలు బయటికి రాకుండా చేశారని.. రాహుల్‌తో పాటు అతడి స్నేహితుల్ని బయటపడేశారని.. మీడియా కూడా ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషించిందని ఆరోపణలున్నాయి.
బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు అమేథీ నుంచి ఢిల్లీకి వెళ్లిపోగా.. వాళ్లు తర్వాత ఏమయ్యారు.. ఎక్కడున్నారు అన్న సమాచారం ఎవరి దగ్గరా లేదు. పన్నెండేళ్లకు పాటు ఈ కేసు విచారణ సాగగా.. గత ఏడాది ఆధారాల్లేవంటూ సుప్రీం కోర్టు కేసు కొట్టేసింది. ఐతే తాజాగా ఓ టీవీ చర్చలో భాజపా నేత సంబిత్ స్వరాజ్ ఓ టీవీ చర్చలో రాహుల్ గాంధీ మీద రేప్ కేసు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ గట్టిగా గళం వినిపించాడు. ఈ నేపథ్యంలో పై హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. దీనిపై లక్షల్లో ట్వీట్లు పడ్డాయి. ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోందీ హ్యాష్ ట్యాగ్.
This post was last modified on July 9, 2020 11:46 am
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…