కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులే చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రాణాలు వదులుతున్న విషాదాంతాలూ చూస్తున్నాం. కరోనాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన వాళ్లు సైతం చివరికి ఆ వైరస్ బాధితులుగా మారుతున్నారు. తాజాగా అలా కరోనా బాధితుడిగా మారిన ఓ రచయిత, గాయకుడు ప్రాణాలు వదిలిన విషాదాంతం హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. సామాజిక అంశాల మీద గద్దర్ తరహాలో పాటలు రాసి, పాడటం ద్వారా నయా గద్దర్‌గా పేరు తెచ్చుకున్న సుద్దాల నిస్సార్ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేత. ప్రజానాట్య మండలి కార్యదర్శిగానూ సేవలందించారు. అనేకసార్లు సామాజిక అంశాలపై తన గళం వినిపించిన నిస్సార్.. కరోనా మహమ్మారి మీదా ఓ పాట రాశారు. స్వయంగా పాడి ప్రజలకు అవగాహన కల్పించారు.
అద్దె గట్టామాయె.. అప్పు పెరిగిపాయె.. వచ్చిన జీతమూ వడ్డీలకే పాయె.. చిట్టి గట్టామాయె.. ఉట్టి చేతులాయె.. పిల్లలా ఫీజుల ఫిగర్ పెరిగిపాయె.. కంపెనీ బందాయె.. ఇల్లు గడవదాయె.. కడుపు నింపేదెట్లరన్నో.. రెక్కాడితే గానీ డొక్కాడనోళ్లము.. దిక్కులేకుంటతైమిరన్నా.. పెట్టుకున్నా పెండ్లి ఆగిపోయే.. దూరమున్న కొడుకు దరికి చేరడాయె..ఇంట్లెవరు చచ్చినా ఇరుగుపొరుగు రారు.. కడసూపు నోచని కన్నీటి గాథలు’ అంటూ కరోనాతో తల్లకిందులైన జీవితాల గురించి ఆయన చాలా ప్రభావవంతంగా రాశారు. అంతే కాక ‘కరోనా రోగంతో ముందు జాగ్రత్తలే కాపాడే మందూలోరన్నా..వ్యాక్సినొచ్చేదాకా మాస్క్ పెట్టుకోని మందితో దూరంముండన్నా.. నవ్వు మందితో దూరముండన్నా..’ అంటూ జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నమూ చేశారు. కానీ చివరికి కరోనా ఆయన్నే కబళించింది. కొన్ని వారాల కిందట కరోనా బారిన పడ్డ నిస్సార్.. కొన్ని రోజులు బాగానే ఉన్నా, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. మెరుగైన చికిత్స కోసం ఆయన అనేక ఆస్పత్రులు తిరిగారని.. చివరికి గాంధీలో చేరితే పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. కరోనా మీద అందరికీ అవగాహన కల్పించి.. చివరికి దానికే నిస్సార్ బలికావడం విషాదం.
This post was last modified on July 9, 2020 11:45 am
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…
టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు…
బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…