సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అనారోగ్యం తీవ్రమై ప్రాణాలు వదిలితే.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరోనా ప్రభావం మొదలయ్యాక గత నాలుగు నెలల్లో రెండంకెల సంఖ్యలో విషాదాంతాలు చూశాం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. ఇంతకుముందెన్నడూ ఇంత తక్కువ మందిలో అంతమంది చనిపోలేదు.
గత నెలలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా కన్నడ యువ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చిన్న స్థాయి సినీ, ఫిలిం సెలబ్రెటీలు గత కొన్ని నెలల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఐతే సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే కొనని నెలల్లో ఇలాంటి విషాదాంతాలు మరిన్ని చూడాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కరోనా ప్రభావంతో దారుణంగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో సినీ రంగం ముందుంటుంది. కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఆర్థిక సంక్షోభానాకి తోడు తోడు.. సామాజిక సంబంధాలు బాగా దెబ్బ తినడం సినీ జనాల్ని డిప్రెషన్ వైపు నెడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు కారణాలేవైనా కానీ.. లాక్ డౌన్ లేకపోయి ఉంటే, మామూలు పరిస్థితుల్లో అయితే అతను అంతటి తీవ్ర నిర్ణయం తీసుకునేవాడు కాదన్నది సన్నిహితుల మాట.
లాక్ డౌన్‌లో ఎక్కువగా ఒంటరిగా ఉండటం వల్ల అతను డిప్రెషన్లోకి వెళ్లి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ బయటికి చాలా కలర్పుల్‌గా కనిపిస్తుంది కానీ.. లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇక్కడ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బండి లాగిస్తుంటారు జనాలు.
ఇక్కడ ఆర్థిక స్థిరత్వం ఉన్న వాళ్లు చాలా తక్కువ శాతం. పని ఉంటే డబ్బులుంటాయి. లేదంటే లేదు. నిర్దిష్టమైన ఆదాయం ఎవరికీ ఉండదు. చాలామంది చాలీ చాలని ఆదాయంతోనే నెట్టుకొస్తుంటారు. ఇక సినీ రంగం అంటే మెయింటైనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో నాలుగు నెలలుగా పని లేక, ఆదాయం లేక అల్లాడిపోతున్న జనాలెందరో. వీళ్లలో చాలామంది ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరూ ఎవరినీ ఆదుకునే పరిస్థితుల్లో లేరు.
ఎవరి మీదా జాలి చూపించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా నిరాదరణకు గురై.. తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వల్ల అన్ని రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ.. బాగా ఎక్స్‌పోజ్ అయ్యేది సినీ రంగం కాబట్టి అక్కడ రాబోయే నెలల్లో ఇలాంటి విషాదాలు మరిన్ని చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు.
This post was last modified on July 9, 2020 9:52 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…