మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థి విషయంలో కేసీయార్ ఎవరినీ లెక్కచేయటం లేదు. ఉపఎన్నికలో పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలన్నది సీఎం ఆలోచన. అయితే సీఎం ఆలోచనతో స్ధానిక నేతల్లో అత్యధికులు తీవ్రంగా విభేదిస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తాము పనిచేసేదిలేదని డైరెక్టుగా కేసీయార్ కే తెగేసి చెప్పారు. దీంతో ఏమిచేయాలో అర్థం కాని కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డిని రంగంలోకి దింపారు.
కూసుకుంట్లకు అనుకూలంగా మద్దతు కూడగట్టాలని కేసీయార్ మంత్రికి ఇచ్చిన ఆదేశాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. గడచిన నెలరోజులుగా ప్రయత్నాలు జరగటం అవంతా ఫెయిలవ్వటం అందరు చూస్తున్నదే. సరే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినపుడు చూసుకుందామని అభ్యర్ధి విషయాన్ని వాయిదా వేశారు. ఇపుడు నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్ 3వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరగబోతోంది. ఈ నేపధ్యంలోనే అధికార పార్టీ అభ్యర్థి ఎంపిక వేడి ఒక్కసారిగా రాజుకుంది.
5వ తేదీ అంటే విజయదశమి రోజున టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా కేసీయార్ ప్రకటించబోతున్నారు. తర్వాత ప్రత్యేకంగా పార్టీ నేతలతో సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగానే మునుగోడులో పోటీ చేయబోయే అభ్యర్ధిని కేసీయార్ ప్రకటించబోతున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. కూసుకుంట్లనే అభ్యర్ధిగా కేసీయార్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఎంతమంది వ్యతిరేకించినా, ఎంత వ్యతిరేకత ఉన్నా పార్టీ అభ్యర్ధి తన ఆలోచనల ప్రకారమే పోటీ చేస్తారని నేతలతో కేసీయార్ స్పష్టం చేశారట.
ఎవరో కొందరు వ్యతరేకించినంత మాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని కేసీయార్ గట్టిగా చెప్పారట. నేతల అభిప్రాయాలు, వ్యతిరేకత వల్ల నిర్ణయాలు తీసుకోవటం సాధ్యంకాదని కూడా సీఎం గట్టిగా అభిప్రాయపడ్డారట. సో పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఎంత వ్యతిరేకత ఉన్నా కేసీయార్ మాత్రం కూసుకుంట్లనే అభ్యర్ధిగా ప్రకటించబోతున్నారు. మరి కూసుకుంట్ల పోటీలోకి దిగిన తర్వాత లోకల్ నేతలు ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on October 4, 2022 12:54 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…