వైసీపీ నిర్వహించిన తాజా అంతర్గత సర్వేలో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని.. తమకు తిరుగులేదని.. గత ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేశాయని చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు..చేస్తున్న అప్పులు కూడా.. పేదల కోసం.. ప్రజల కోసమేనని చెబుతున్నది కూడా తెలిసిందే. దీంతో తమ గ్రాఫ్ దేదీప్యమానంగా విరాజిల్లుతోందని ప్రభు త్వ పెద్దలు చెబుతున్నారు.
అయితే.. తాజాగా పార్టీ చేయించిన అంతర్గత సర్వేలు.. ఐప్యాక్.. సంస్థ నిర్వహించిన ప్రజల అభిప్రాయాలను గమనిస్తే.. భిన్నమైన ఫలితం వచ్చిందట. సంక్షేమ పథకాలు అందుతున్న వారుకూడా.. సర్కారుపై అంత పాజిటీవ్‌గా లేరనేది సర్వేలు చెబుతున్న వాస్తవమని తేలిందట. ఎందుకంటే.. ప్రజలకు ఎన్ని చేసినా.. రెండు కారణాలను ప్రతిపక్షాలు.. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాయని.. వాటిపై ప్రజలు చర్చించుకుంటున్నారని.. తెలుస్తోంది.
ముఖ్యంగా.. జగన్ ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము.. కొందరికే(లబ్దిదారులు) అందుతోంది. అది కూడా.. అప్పు లు చేసి ఇస్తున్నామని.. ప్రభుత్వమే చెబుతోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారం.. మిగిలిన మెజారిటీ ప్రజలపైనే పడుతోంది. దీంతో వారిలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఇక, జగన్ ఇస్తున్నది ఆయన జేబులో సొమ్ము కాదని.. ప్రజల ధనమేనని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం కూడా బాగానే ఎక్కింది. ఇక, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తూ.. మరోవైపు పన్నుల రూపంలో గుంజుకుంటోందన్న విషయంపైగా ప్రజలు చర్చించుకుంటున్నారు.
ధరల పెరుగుదల, పన్నుల బాదుడు… మద్యం ధరలు.. ఇలా అనేక అంశాలపై ప్రజలు చర్చించుకుం టున్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమంపై పెద్దగా ఎవరూ సంతృప్తి వ్యక్తం చేయడం లేదేని సర్వేలో స్పష్టంగా తెలిసిందని సమాచారం. దీంతో ఇన్ని వేల కోట్లు అప్పులు చేసి.. కూడా.. ప్రజల నుంచి ఓట్లు పిండుకోలేక పోతే.. ఎలా.. అని తాడేపల్లి వర్గాలు.. ఆత్మరక్షణలో పడ్డాయని అంటున్నారు. మరి దీనిపై ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on October 3, 2022 10:55 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…