ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కరలేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం బండ్ల గణేష్ వార్తలో నిలుస్తుంటారు. ఇటీవల ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ నాగరాజుతో జరిగిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఫైర్ అయిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూరీ జగన్నాథ్ గురించి, పోసాని కృష్ణమురళి గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
అయితే, ఆ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి నాగరాజు అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అనిల్, బండ్లల మధ్య జరిగిన సంభాషణపై ఇప్పుడు భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్ కు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారని నాగరాజు ప్రశ్నించాారు. ఈ ప్రశ్న అడగడంతోనే బండ్ల గణేష్ వీరావేశంతో ఊగిపోయారు.
వెంటనే అనిల్ కుమార్ యాదవ్ కు బండ్ల గణేష్ ఫోన్ చేసి మాట్లాడారు. బండ్ల గణేష్ తో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ అన్న చెప్పన్నా అంటూ మాట్లాడడం వైరల్ అయింది. మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని నాగరాజు గారు అడుతున్నారు అంటూ బండ్ల గణేష్ చెప్పిన ప్రోమో ట్రెండ్ అవుతోంది. అనిల్ కుమార్ తో మాట్లాడిన తర్వాత బండ్ల గణేష్ ఇక్కడ…అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో దట్ ఈజ్ బండ్ల గణేష్ అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అట్లుంటది బండ్ల గణేష్ తోని అంటూ సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on October 1, 2022 9:51 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…