కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఖాతాలో టీఆర్ఎస్ మొదటి వికెట్ పడిందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఇబ్రహింపట్నం ఎంఎల్ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం విచారణకు పిలిపించిన ఉన్నతాధికారులు సుమారు తొమ్మిది గంటలపాటు విచారించారు.
కొద్దిరోజుల క్రితం క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ విదేశాల్లో క్యాసినో ఆడేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు ప్రముఖులను తీసుకెళ్ళినట్లు ఆరోపణలు వచ్చాయి. చికోటితో రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొందరు నేపాల్, శ్రీలంక, థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియాకు రెగ్యులర్ గా వెళ్ళి క్యాసినోల్లో ఆడివస్తారనేది సమాచారం. అయితే ఓడిపోతే ఓకే అదే గెలిస్తే అక్కడినుండి మన దేశంలోకి డబ్బులు ఎలాగ తీసుకొస్తారు ? ఇక్కడే చికోటి ద్వారా క్యాసినో గెలుసుకున్న ప్రముఖులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది.
క్యాసినో విషయంలోనే చికోటితో పాటు చాలామంది ప్రముఖులను ఈడీ ఇప్పటికే విచారించింది. ఇందులో భాగంగానే మంచిరెడ్డిని విచారిస్తున్నది. అయితే మంచిరెడ్డి వ్యాపార పనులపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు వెళ్ళివచ్చినట్లు కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. విదేశాల్లోని ఒక గోల్డ్ మైన్ లో పెట్టుబడులపై ఈడీ గతంలోనే మంచిరెడ్డికి నోటీసులిచ్చి విచారించింది.
అయితే అప్పట్లో ఎంఎల్ఏ సరైన సమాధానాలు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తోంది. బహుశా ఈ విషయంలో కూడా విచారణ జరుగుతున్నదేమో. ఢిల్లీలో జరిగినట్లుగా ఆరోపణలున్న లిక్కర్ స్కామ్ లో తెలంగాణాలోని అధికార పార్టీ ప్రముఖులపై ఈడీ కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లిక్కర్ స్కామ్ లో కాకుండా క్యాసినో అని విదేశాల్లో వ్యాపారాలని ఏదో కారణంతో ఈడీ టీఆర్ఎస్ ఎంఎల్ఏని విచారణ చేయటం కలకలం రేపుతోంది. మొత్తానికి ఏదో పద్దతిలో ప్రముఖులను అదుపులోకి తీసుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. చూడాలి చివరకు ఏమవుతుందో.
This post was last modified on September 28, 2022 10:46 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…