నాన్ బీజేపీ ప్రభుత్వాలను నిర్వీర్యం చేయలని నరేంద్రమోడీ కంకణం కట్టుకున్నట్లే ఉంది. అందుకనే ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లను ముందు పెట్టి నరేంద్రమోడీ సర్కారే వ్యవహారాలన్నింటినీ నడుపుతోంది. పంజాబ్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈనెల 27వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపి తీరుతామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.
మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ లాంటి అన్ని పార్టీలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. దాంతో ఆప్ ప్రభుత్వం అంటే బీజేపీకి మండిపోతోంది. దీనికి మరో కారణం ఏమిటంటే ఈ సంవత్సరం చివరలో జరగబోతున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి ఆప్ గండికొట్టబోతోందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. గుజరాత్ లో జరుగుతున్న సర్వేల్లో ఎక్కువ భాగం ఆప్ మంచి ఫలితాలు సాధిస్తుందనే వస్తున్నాయి.
దీంతో గుజరాత్ లో ఓడిపోతే పరువుపోతుందన్న ఆందోళనతో ఇటు ఢిల్లీలోను అటు పంజాబ్ లోను ఆప్ ప్రభుత్వాలను బీజేపీ అస్తిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ లో బీజేపీకి దెబ్బపడిందంటే పోయేది నరేంద్రమోడీ పరువే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకనే ఆప్ ని నిర్వీర్యం చేయటానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి గురువారమే పంజాబ్ లో విశ్వాస తీర్మానం విషయంలో ప్రత్యేక అసెంబ్లీ జరగాల్సుంది.
మొదట పర్మిషన్ ఇచ్చిన గవర్నర్ ఏ కారణం చేతనో వెంటనే రద్దు చేశారు. దాంతో ఆప్ ఎంఎల్ఏలందరు పంజాబ్ రాజభవన్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ కారణంతోనే ఈనెల 27వ తేదీన ప్రత్యేక సమావేశాలు జరపబోతున్నట్లు సీఎం చెప్పారు. దీనికి గవర్నర్ అనుమతే అవసరం లేదని కూడా చెప్పేశారు. అంటే ముందు అసెంబ్లీ సమావేశాలకు అసలు గవర్నర్ జోక్యాన్ని కూడా ఆప్ సహించేట్లులేదు. ఇప్పటికే తెలంగాణా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేసీయార్ గవర్నర్ జోక్యాన్ని చాలా తగ్గించేశారు. బహుశా పంజాబ్ లో ప్రతిరోజు ఏదో గొడవ తప్పేట్లు లేదు.
This post was last modified on September 23, 2022 3:08 pm
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…