Political News

‘వైకాపా ప్రభుత్వం.. అది 3 వేల కోట్ల స్కాం’

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇళ్ల స్థ‌లాల పంపిణీ విష‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందులో రూ.3 వేల కోట్ల కుంభ‌కోణం దాగి ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ప్ర‌జ‌ల‌కు ప‌నికి రాని భూములు ఇస్తోంద‌ని ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆయ‌న‌.. తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన ఇళ్ల‌ను పేదలకు ఇవ్వడానికిఎందుకు మనసురావడం లేదని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం రూ.3వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని.. దీనిపై వెంట‌నే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు కేటాయించాలి కోరారు. ఇళ్లు నివాసానికి సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ 15 నెలల‌కు కూడా వాటిని పేద‌ల‌కు ఇవ్వ‌కుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

2014-2019 మధ్యన కేంద్రం, రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయించిందని.. వీటిలో 8.50 లక్షల ఇళ్లను గత ప్రభుత్వమే పేదలకు ఇచ్చిందని .. గృహప్రవేశాలకు సిద్ధమైన మిగ‌తా 6 లక్షల ఇళ్లను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నిరుపయోగంగా మార్చిందని అశోక్ బాబు విమ‌ర్శించారు. అత్యాధునిక వసతులతో, నాణ్యతా ప్రమాణాలతో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలుగా మార్చిందని.. పూర్త‌యిన‌ ఇళ్లను పేదలకు కేటాయించకుండా, ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఊళ్లకు దూరంగా, రోడ్డు, నీటి, విద్యుత్ వసతి లేని ప్రాంతాల్లో సెంటు స్థలం ఇస్తే పేదలకు ఏం ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం 151 సీట్లున్నాయని, వాపుని చూసి బలుపు అనుకుంటోంద‌ని.. పాలకులు నేలమీదకు దిగిరావడానికి ఎంతో సమయం పట్టద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

This post was last modified on July 7, 2020 4:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగిల్ డే… జగన్ కు డబుల్ స్ట్రోక్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…

34 minutes ago

అవకాశాలు వదిలేస్తున్న విశ్వంభర

జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…

1 hour ago

చంద్ర‌బాబు.. ఎస్టీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌…!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజ‌న ప్రాబ‌ల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీల‌కు భారీ మేలును…

1 hour ago

మహానాడులో మార్పు లేదు..

ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…

2 hours ago

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

4 hours ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

6 hours ago