బహుభాషా నటుడు.. ఫైర్‌బ్రాండ్ ప్రకాష్ రాజ్.. తాజాగా చేసిన ట్వీట్.. రాజకీయంగా సంచలనంగా మారింది. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్.. ఆయన విధానాలను నిశితంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కవులు, రచయిత నిర్బంధాల నుంచి ముస్లింలపై దాడుల వరకు అనేక సందర్భాల్లో ప్రకాష్‌రాజ్.. తన విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. దేశంలో 8 చీతాలను విడుదల చేశారు. దేశంలో 70 ఏళ్ల కిందటే అంతరించిన.. చీతాలను నమీబియా దేశం నుంచి తీసుకువచ్చి.. మరీ.. మధ్యప్రదేశ్ లోని కునో.. జాతీయ పార్కులో మోడీ విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. గత కాంగ్రెస్‌పైనా విమర్శలు గుప్పించారు. అంతరించిపోయిన.. చీతాలను దేశంలోకి తిరిగి ప్రవేశ పెట్టాలన్న ధ్యాస.. ఏమాత్రం లేదని.. నిప్పులు చెరిగారు.
తాను తీసుకున్న చర్యల కారణంగానే.. దేశంలో తిరిగి చీతాల సందడి ప్రారంభమైందని అన్నారు. అయితే.. దీనిపై ప్రకాష్ రాజ్ ఆసక్తిగా స్పందించారు. “ఎక్కడో అడవుల్లో ప్రశాంతంగా ఉండే.. చీతాలను దేశానికి తీసుకువచ్చారు. బాగానే ఉంది. కానీ, దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తీసుకుని దేశం వదిలి పారిపోయిన ‘చీతాల’ సంగతేంటని ప్రశ్నించారు.
నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, చౌక్సీ వంటి ఘరానా చీతాలు.. ప్రపంచ దేశాల్లో.. కాలర్ ఎగురేసుకుని.. తిరుగుతున్నారని.. వాటిని ఎప్పుడు దేశానికి తీసుకువస్తారో చెప్పాలని.. ప్రధాని మోడీని ప్రశ్నించారు ప్రకాష్‌రాజ్. దేశాన్ని కొల్లగొట్టి.. ప్రస్తుతం విదేశాల్లోదాక్కొన్న వీరిని తిరిగి రప్పించే ప్రయత్నాల విషయంలో మోడీ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నది ప్రకాష్ రాజ్ విమర్శ. మరిదీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 18, 2022 2:33 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…