కొన్ని విషయాల్లో రాజకీయ పార్టీలు ముందుండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం డిఫరెంట్‌గా ఉంటుంది. అంతేకాదు.. కొన్ని కొన్ని విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే.. వాటిని అంతే బలంగా ముందు నుంచి ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా .. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తానని, అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న జనసేన గురించే. వచ్చే ఎన్నికల సంగతిని పరిశీలిస్తే.. జనసేనకు ఉన్న బలం అంతంతమాత్రమే.
గత ఎన్నికల్లో తొలిసారి జనసేన రంగంలోకి దిగినప్పుడే.. 143 స్థానాల్లో పోటీకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరిలోనూ మెజారిటీ నాయకులు కొత్తవారు. మిగిలిన స్థానాల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక, ఇప్పుడు.. పరిస్థితికి వస్తే.. అదే సీన్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతం కన్నా.. తక్కువగానే.. నాయకులు ఉన్నారు. చాలా మంది మేధావులు పార్టీని వీడిపోయారు. ఎస్సీ, ఎస్టీలు పార్టీలో కనిపించడం కూడా లేరు. బీసీలు ఉన్నా.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు.
ఈ పరిణామాలు.. పార్టీపై ప్రభావం చూపుతున్నాయి. మరో విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతొ పొత్తు పెట్టుకుంటుంది? అనేది చర్చకు వస్తున్న విషయం. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నా.. ఆ పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనసులు కలవని పార్టీలుగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయని.. పార్టీలోనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ విషయంలోనే క్లారిటీ అవసరమని అంటున్నారు.
ఎందుకంటే.. జనసేన అధినేత పవన్‌పై ఇటు ప్రజల్లోనూ.. అటు పార్టీ నాయకుల్లోనూ చాలా విశ్వసనీయత ఉంది. అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ పొత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఈ విశ్వసనీయతకే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని.. మధ్యలోనే బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ టీడీపీతొ పొత్తు ఉంటుందని కొంత, లేదని కొంత వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాలతో జనసేన ఇప్పటికే తొందరపడితే బాగుంటుందని.. పొత్తులపై ఒక క్లారిటీ ఇప్పుడే ఇచ్చేస్తే బెటర్ అని కొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 4, 2022 6:19 pm
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…