పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో దీని రికార్డుల గురించి పత్రికల్లో పేజీలు పేజీలు వచ్చేవి. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ తో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ పెద్ది దర్శకుడు బుచ్చిబాబుకి గొప్ప స్ఫూర్తి అనే విషయం ఇవాళ బయట పడింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన సందర్భంగా ఆయన ఎవరికీ చెప్పని సంగతులు పంచుకున్నారు.
బుచ్చిబాబు చదువుకునే రోజుల్లో తొలిప్రేమ విడుదలయ్యింది. కిరణ్ రాజ్ అనే తోటి విద్యార్ధి ఇంటర్ మీడియట్ స్టేట్ థర్డ్ వచ్చాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే అతను పవన్ వీరాభిమాని కావడమేనట. సో కిరణ్ కంటే గొప్పవాడు కావాలంటే ఏదో సాధించాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు బుచ్చిబాబు డైరెక్టర్ అయిపోవాలని నిర్ణయించుకున్నాడు. తొలిప్రేమలో ‘హేప్పా ఏమైందో ఏమో ఈ వేళ’ పాటకు థియేటర్ పైకప్పు ఎగిరిపోవడం చూసి మనసులో డిసైడైపోయి హైదరాబాద్ వచ్చేశాడు.
అలా మొదలైన ప్రయాణం సుకుమార్ శిష్యుడిగా మార్చి ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది చేసే దాకా తీసుకొచ్చింది. ఒకవేళ తొలిప్రేమ ఇన్స్ ఫైర్ చేయకపోయి ఉంటే బుచ్చిబాబు బహుశా పిఠాపురంలోనే ఉండిపోయేవారేమో. పవన్ ని చూసి పరిశ్రమకు వచ్చి ఇప్పుడు ఏకంగా ఆయన అన్నయ్య మెగాస్టార్ అబ్బాయిని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. అందుకే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కావడం మా అదృష్టం అంటారు బుచ్చిబాబు.
ఈ వేడుక జరుగుతున్న టైంలోనూ బుచ్చిబాబు పెద్ది షూటింగ్ లోనే ఉన్నాడు. హాజరు కావడం కోసం త్వరగా పూర్తి చేసి రామ్ చరణ్ కు చెప్పి వచ్చేశారు. చిరంజీవి దగ్గర ఎంత నేర్చుకున్నానో అంతకు వంద రెట్లు బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్న మాటను చరణ్ స్వయంగా బుచ్చిబాబుకు చెప్పి పంపడం విశేషం. మొత్తానికి ఎక్కడో పిఠాపురంలో ఉండే ఒక సామాన్య కుర్రాడు ఇప్పుడు పెద్ది లాంటి ప్యాన్ ఇండియా మూవీని డైరెక్ చేసే స్థాయికి రావడం వెనుక అసలు కారణం తొలిప్రేమన్నమాట.
This post was last modified on March 16, 2026 12:20 am
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…