ఏపీలోని వైసీపీ సర్కారులో ప్రస్తుతం నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. గత తొలి మంత్రి వర్గంలోనూ.. ముగ్గురికి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారు. ఇప్పుడు.. వీరిని మరో అంకె పెంచి.. నాలుగు చేశారు. వీరిలో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన.. ఉష శ్రీచరణ్, చిత్తూరుకు చెందిన ఆర్కే రోజా, మరొకరు.. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన విడదల రజనీ, ఇంకొకరు.. పశ్చిమ గోదావరి (ప్రస్తుతం ఏలూరు) జిల్లా కొవ్వూరు కుచెందిన తానేటి వనిత.
ఈ నలుగురు కూడా సామాజిక వర్గాల పరంగా.. ఓసీ, బీసీ, ఎస్సీలు. అయితే.. ఇప్పటికి.. వీరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి.. 100 రోజులు పూర్తయ్యాయి. మరి వీరిలో ఎవరు పనిమంతులు..? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారనేది వైసీపీ సీనియర్ల టాక్! ఆశ్చర్యంగా ఉన్నా నిజమని అంటున్నారు. మరొకరు.. ఫైర్‌బ్రాండ్‌కే పరిమితం అయ్యారని చెబుతున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు వివాదాస్పదం అయ్యారు. ఇంకొకరు.. సైలెంట్ అయ్యారని అంటున్నారు.
దీంతో ఈ నలుగురు మహిళా మంత్రుల్లో ఒక్కరు మాత్రమే జగన్ అంచనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని.. గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ విషయానికి వస్తే.. జబర్దస్త్ రోజా.. ఎప్పుడూ.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. సవాళ్లకే పరిమితం అవుతున్నారు. అసలు ఆమె చూస్తున్న పర్యాటక శాఖలో పెద్దగా పనేమీ లేదని కూడా అంటున్నారు. దీంతో ఆమె వల్ల ప్రభుత్వానికి వచ్చిన ప్రత్యేక లబ్ధి అంటూ.. ఏమీ లేదని బాహాటంగానే చెబుతున్నారు.
ఇక, వివాదాస్పద మంత్రిగా తానేటి వనిత నిలిచారు. ఇటు నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరకంగా గ్రూపులు కడుతున్నారు. మరోవైపు.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారి తల్లుల పెంపకమే కారణం అంటూ.. వ్యాఖ్యానించి.. తీవ్ర సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఇక, అనంతకు చెందిన మంత్రి ఉష.. ఎక్కడా అసలు కనిపించడం లేదు. ఆదిలో కూడా ఆమె పెద్ద ఎత్తున ప్రదర్శనగా తన నియోజకవర్గానికి వెళ్లడంతో అక్కడ జరిగిన ఓ ఘటన ఆమెను తీవ్ర వివాదంలోకి నెట్టేసింది.
ఇక, వైసీపీ నేతలు చెబుతున్న పనిమంతుల జాబితాలో.. ఏకైక మహిళా మంత్రిగా.. విడదల రజనీ నిలిచారు. ఆమె ఆదిలో ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేసినా.. మంత్రి అయిన తర్వాత.. మాత్రం.. పార్టీని పక్కన పెట్టి.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అవకాశం ఇస్తున్నారు. వైద్య శాఖ మంత్రిగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆమె నిత్యం తనిఖీ చేస్తున్నారు. అవినీతిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో సమయ పాలన పాటించాలని.. వైద్యులను గట్టిగానే లైన్‌లో పెడుతున్నారు. దీంతో మొత్తం నలుగురు మహిళా అమాత్యుల్లోనూ.. విడదలకు మంచి మార్కులు పడుతున్నాయని అంటున్నారు.
This post was last modified on September 1, 2022 12:34 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…