Political News

కేసీఆర్ న‌యా నిజాం: న‌డ్డా కామెంట్స్‌

తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా కేసీఆర్‌ వంటి ఆంక్షలే విధించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై మండిపడ్డారు.

కాకతీయులు ఏలిన వరంగల్‌ గడ్డకు నమస్కారాలు అని తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు. కేసీఆర్‌ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జేపీ నడ్డా ఆరోపించారు. సభకు ముందురోజు అనుమతి రద్దు చేయించారని మండిపడ్డారు. హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందామని తెలిపారు. పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు.

ఓరుగల్లులో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని జైలును కూల్చారని జేపీ నడ్డా అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మించలేదని మండిపడ్డారు. కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

అందులో అవినీతి చేశారు!

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ను ఏటీఏంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదని ఆగ్రహం వక్తం చేశారు. అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైందని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

This post was last modified on August 27, 2022 10:09 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

11 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

12 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago