కాలం మారుతోంది.. రాజకీయాలు కూడా మారుతున్నాయి. ప్రజల ఇష్టాయిష్టాలు కూడా మారుతున్నాయి. అయితే.. ప్రజల నాడిని పట్టుకుని పయనిస్తున్నపార్టీలు మాత్రం తగ్గుతున్నాయి. ఇప్పుడు.. ఈ చర్చ ఎం దుకు వచ్చిందంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా చూస్తానంటూ.. వ్యాఖ్యానిస్తు న్న పవన్ విషయంలోనే! వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం.. పార్టలో ఆసక్తిగా మారింది. ఏ ప్రాతిపదికన టికెట్లు ఇస్తారు? అనేది చర్చగా మారింది.
ఎందుకంటే.. వైసీపీ వ్యతిరేక ఓటుబ్యాంకును చీల్చకుండా చూడాలంటే.. ఒక్క కాపుల వల్ల మాత్రమే పనికాదు. దీనికి సంబంధించి రెడ్డి సామాజికవర్గం.. బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ.. బీసీ వర్గాలు.. అన్నీ కూడా పవన్‌కు అనుకూలంగా ఉండి తీరాలి. అదేసమయంలో ఎంపిక చేసే అభ్యర్థుల్లోనూ.. సత్తా ఉండాలి. ఈ విషయాల్లో ఎక్కడ తేడా కొట్టినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పవన్‌కు పరాభవం తప్పదనే వాదన వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు పైన చెప్పుకొన్నట్టుగా.. ఆయా వర్గాలు… పవన్‌కు కనెక్ట్ కావడం లేదు.
ఒక్క కాపులు.. యువతలో మాత్రమే పవన్ ఇమేజ్ ఉంది. ఇతర రెడ్డి వర్గం కానీ.. వ్యాపార.. వాణిజ్య , పారి శ్రామికవర్గాలు కానీ.. పవన్‌ను పక్కన పెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం వ్యూహం లేకపోవడ మే. ఆయా వర్గాలు ఏవీ కూడా.. రాజకీయంగా రాష్ట్రంలో దుమారం కోరుకోవడం.. లేదు. అభివృద్ధిని ఇచ్చే ప్రభుత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న అప్పుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే సర్కా రును మాత్రమే కోరుకుంటున్నారు.
అయితే.. ఈ విషయంలో ప్రజలను కానీ.. ఆయా వర్గాలను కానీ.. మెప్పించడంలో పవన్ విఫలమవుతున్నారు. కేవలం యువతను పట్టుకుని ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. మేధావులను కానీ..ఇతర సామాజిక వర్గాలను కానీ.. ఆయన ఆకర్షించడం లేదు. వారికి అనుకూలంగా ఎలాంటి తీర్మానాలు కూడా ప్రవేశ పెట్టడం లేదు. ఇదిలావుంటే..ఉద్యోగ వర్గాల మాటేంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు.. పవన్ విషయం ఏమో.. కానీ.. ఉద్యోగులే పవన్‌ను అసలు పట్టించుకోవడం లేదు. ఇదీ.. సంగతి!!
This post was last modified on August 27, 2022 9:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…