దేశంలో ఒకవైపు ధరలు మండిపోతున్నాయి. నిరుద్యోగం తాండవిస్తోంది. ఎక్కడికక్కడ మత ఘర్సణలు.. నిత్యం ఏదో ఒక వివాదం దేశాన్ని పట్టికుదుపుతోంది. దీంతో ప్రతిపక్షాలు.. నిత్యం ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు కురిపిస్తున్నాయి. ఆయన పాలనను ఛీత్కరిస్తున్నాయి. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దింపి తీరాలనే పట్టుదలతో పలు పార్టీల నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ప్రతిపక్షాల వ్యూహాలు ఇలా ఉంటే.. మరోవైపు ప్రజలు మాత్రం.. మోడీకే జై కొడుతుండడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోడీని దేశ ప్రజల్లో 75 శాతం మంది ఆమోదిస్తున్నారని, ఆయన పాలనను మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజా మోదం ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆయన పాలనపై ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నట్టు పేర్కొంది.
మోడీ పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదిం చుకున్నారు మోడీ. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్ ‘ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంలో నిలిచారు.
63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో.. అమెరికా అధ్యక్షుడి తర్వాత స్థానంలో ఉన్నారు.
అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఇక, మోడీని వ్యతిరేకించే వారు ఏం మాట్లాడతారో చూడాలి.
This post was last modified on August 27, 2022 5:43 am
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…