గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో పెను సునామీ వచ్చింది. పార్టీ కీలక నాయకుడు.. కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్.. హస్తం పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలినట్టయింది.
ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాకే పార్టీ నాశనమైందని విమర్శలు గుప్పించారు. సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీది.. చిన్నపిల్లల మనస్తత్వం.. సీనియర్లు అందరిని రాహుల్ పక్కన పెట్టేశారంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు.
అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ మాత్రం ఆజాద్‌కు అరుదైన గౌరవం ఇచ్చింది. ఈ ఏడాది పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. దీంతో ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది.
This post was last modified on August 26, 2022 6:25 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…