ఒకప్పుడు.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వినాయక చవితి వేడుకలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. గల్లీ నుంచి అన్నట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎక్కడైనా వినాయక చవితి పందిళ్లు వేసుకునేందుకు పర్మిషన్లు ఇచ్చేవారు.
అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..కరోనా నేపథ్యంలో ఈ అనుమతులకు బ్రేక్ పడిందనే చెప్పాలి. అప్పట్లో కరోనా విజృంభణ నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేదు. ఇలా రెండేళ్లపాటు.. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు జరగలేదు. గత ఏడాది కూడా.. స్వల్పంగానే అనుమతులు ఇచ్చారు. ఎక్కడా భారీ ఎత్తున పందిళ్లు వేయకుండా చర్యలు తీసుకున్నారు. ఇక, ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో.. పందిళ్లు వేసేందుకు.. యువత ఉత్సాహంగా ఉన్నారు.
అయితే.. ఇప్పుడు కూడా ఏపీ సర్కారు ఆంక్షలు విధించింది. ప్రతి పందిరికి అనుమతులు తప్పని సరి అని పేర్కొంది. అంతేకాదు.. గతానికి భిన్నంగా.. ఇప్పుడు అగ్నిమాపక దళం నుంచి కూడా అనమతులు తెచ్చుకోవాలని సూచించింది. అదేసమయంలో చవితికి ఏర్పాటు చేసే పందిళ్ల సైజును బట్టి.. ఒక్కొక్క పందిరికీ రూ. 1000 గరిష్టంగా పన్ను విధించాలని.. అన్ని మునిసిపాలిటీలకు అనధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు.. చెత్తపన్ను కూడా విధించనున్నారు.
ఇక, పందిళ్లలో లౌడ్ స్పీకర్లపై బ్రేక్ ఇచ్చారు. ఎలాంటి ఊరేగింపులు.. జరపరాదని.. నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి లౌడ్ స్పీకర్లు వాడరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇది రాజకీయంగా మలుపు తి రిగింది. దీనిపై స్పందించినటీడీపీ..నాయకులు వినాయక పందిరికి రోజుకు రూ.వెయ్యి పన్ను కట్టాలనటం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి పండుగ జరగకుండా చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.
హిందూమతం మీద జగన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. పండుగలపై జగన్ రెడ్డి పెత్తనం ఏంటని నిలదీశారు. పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే… తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ తుగ్లక్ పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని దుయ్యబట్టారు.
This post was last modified on August 24, 2022 3:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…