Political News

ఎంఎల్ఏల్లో మొదలైన టెన్షన్

అధికార పార్టీ ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైందా ? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒకే ఒక వార్నింగ్ తో చాలామంది ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఇంతకీ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తను నియమించటమే. మామూలుగా ఎంఎల్ఏలు ఉన్న నియోజకవర్గాలకు వాళ్ళే సమన్వయకర్తలుగా ఉంటున్నారు. వైసీపీ ఎంఎల్ఏలు ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్ధులనే సమన్వయకర్తలు గా నియమించారు.

అయితే తాడికొండలో వైసీపీ ఎంఎల్ఏ డాక్టర్ శ్రీదేవి ఉండగానే అదనపు సమన్వయకర్తగా ఎంఎల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించారు. సమన్వయకర్తగా ఎంఎల్ఏ ఉన్నపుడు అదనపు సమన్వయకర్తగా మరో నేతను  నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే శ్రీదేవి పనితీరు బాగా లేదని జగన్ కు రిపోర్టులు వచ్చుండచ్చు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని జగన్ అనుకునుండచ్చు. లేదా ఆమె పనితీరును మెరుగుపరుచుకుంటుందున్న ఉద్దేశ్యంతోనే అదనపు సమన్వయ కర్తను నియమించుడచ్చు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పనితీరు మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని జగన్ ఇప్పటికే స్పష్టంగా రెండు మూడు సందర్భాల్లో చెప్పేశారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందే అని ఆదేశించారు. ఇన్నిసార్లు జగన్ చెప్పినా కొందరు యాక్టివ్ గా లేరు. మరికొందరు జనాలతోను, పార్టీ క్యాడర్ తో ను టచ్ లో లేరని ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళని పిలిచి వార్నింగులిస్తున్నా కొందరిలో మార్పు రాలేదటని సమాచారం.

ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఆమె చుట్టూ చాలా వివాదాలున్నాయి. అలాగే ఆమెపై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో ఆమె లాభంలేదని జగన్ భావించి నియోజకవర్గంలో అదనపు సమన్వకర్తను నియమించారు. అంటే తొందరలోనే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తలను నియమించబోతున్నారనే సంకేతాలు వెళ్ళాయి. దాంతో ఏ ఏ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమిస్తారనే విషయంలో చర్చ పెరిగిపోతోంది. ఈ విషయంలోనే ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on August 23, 2022 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago