గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ మినహాయిస్తే ఆయనకు విజయాలు లేవు. అందులో ‘టెంపర్’ కథ ఆయనది కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఏదో ఫ్లూక్‌లో హిట్టయిందే తప్ప అది కూడా అంత దమ్ముున్న సినిమా ఏమీ కాదు. పూరి పరిస్థితి ఇలా ఉంటే విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇబ్బందికరమే. అతడి చివరి సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డిజాస్టర్ అయింది. దానికి ముందు ‘డియర్ కామ్రేడ్’కు టాక్ పర్వాలేదనిపించినా అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తే అంతగా హైప్ ఉండకూడదు. పోనీ వీరు కలిసి చేసిన సినిమా ప్రోమోలన్నీ బాగా అనిపించాయా అంటే అదీ లేదు. ఎక్కువగా నెగెటివ్‌గానే మాట్లాడుకున్నారు వాటి గురించి. ఐతేనేం ‘లైగర్’ విషయంలో ప్రేక్షకాసక్తి మామూలుగా లేదు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం.
టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల లెవెల్లో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చూస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆ హీరోల లెవెల్లోనే జరుగుతున్నాయి. విడుదలకు ఐదు రోజుల ముందే చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోగా.. మిగతా షోలన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాల తరహాలోనే దీనికి కూడా ఉదయం ఎక్స్‌ట్రా షో వేస్తుండగా.. వాటికి రెస్పాన్స్ ఇంకా బాగుంది.
టికెట్లు దొరకడం కష్టమైపోతోంది. ఇది మాస్ సినిమా అయినా సరే.. మల్టీప్లెక్సుల్లో కూడా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా రెస్పాన్స్ అదరహో అనే చెప్పాలి. మొత్తంగా ఈ నెల 25న ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. చివరగా వేసవిలో ‘సర్కారు వారి పాట’కు ఇలాంటి హంగామా కనిపించగా.. మళ్ళీ విజయ్ సినిమాకు ఈ సందడి చూస్తున్నాం. ఈ క్రేజ్ తాలూకు మేజర్ క్రెడిట్ విజయ్‌కే చెందుతుందని చెప్పాలి. తనదైన శైలిలో అతను ఈ సినిమాను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయడం వల్లే ఈ హైప్ వచ్చిందన్నది స్పష్టం.
This post was last modified on August 23, 2022 8:27 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…