Political News

చంద్ర‌బాబు వైఖ‌రితో త‌మ్ముళ్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనుస‌రిస్తున్న వైఖ‌రితో త‌మ్ముళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా? అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయకులు.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా.. నాయ‌కుల‌తో స‌మీక్ష‌లు చేస్తున్నారు. వ‌రుసగా సాగుతున్న ఈ ప‌రిణామాల‌తో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు హుషారుగా ఉన్నారు. ఎందుకంటే.. ఈ స‌మీక్ష‌ల్లో చంద్ర‌బాబు.. కొంద‌రికి టికెట్లు ఖ‌రారు చేస్తున్నార‌నే వార్త‌లు రావ‌డ‌మే.

అది కూడా.. చంద్ర‌బాబు అనుకూల మీడియాలోనే… ఈ వార్త‌లు వ‌స్తున్నాయి. ఏకంగా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందుగానే చంద్ర‌బాబు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నార‌ని.. టీడీపీ చ‌రిత్ర‌లోనే ఇది రికార్డ‌ని ప‌త్రిక‌లు రాసుకొస్తున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌రకు స‌మీక్ష‌లు జ‌రిగిన ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు హుషారుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని.. భావిస్తూ.. సంబ‌రాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. రెట్టించిన ఉత్సాహంతో పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

అయితే.. ఇలా సాగుతున్న క్రమంలో చంద్ర‌బాబు చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. పార్టీలో నాయ‌కుల‌ను నిరాశ‌కు గురి చేసింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వర‌కు తాను కేవ‌లం స‌మీక్ష‌లు మాత్ర‌మే చేశాన‌ని.. ఎవ‌రికీ టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని.. చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. టికెట్ల విష‌యాన్ని నాయ‌కులు మ‌రిచిపోవాల‌ని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ప్ర‌తి మూడు మాసాల‌కు ఒక‌సారి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంపైనా.. స‌మీక్ష‌లు చేస్తాన‌ని చెప్పారు. అప్పుడు కానీ.. నిర్ణ‌యం వెలువ‌రించ‌న‌ని అన్నారు.

ఇదే ఇప్పుడు.. పార్టీలో తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారిపోయింది. ఎందుకంటే.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని అనుకుంటున్న‌వారు.. ప‌నిచేసేవారు.. తీరా ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందో లేదో..అని వ‌గ‌రుస్తున్నారు. ఇంతా క‌ష్ట‌ప‌డి తాము.. ఇంత చేస్తే.. రేపు ఎవ‌రికో టికెట్ ఇస్తే.. త‌మ ప‌రిస్థితి ఏంటని వారు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న టీడీపీలో పెను క‌ల‌క‌లంగా మారింది. ఏదో ఒక‌టి క‌న్ఫ‌ర్మ్ చేస్తే.. పూర్తిగా ప‌నిచేసేందుకుతాము సిద్ధ‌మ‌ని.. ఇలా నాన్చ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంట‌ని.. కొంద‌రు సీనియ‌ర్లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. 

This post was last modified on August 21, 2022 12:32 pm

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

39 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

46 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

4 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago