ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ పవనాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో గుంటూరులో వైసీపీ హవా జోరుగా సాగింది. వాస్తవానికి రాజధాని అమరావతి ఏర్పాటుతో తమకు తిరుగులేదని అనుకున్న టీడీపీకి ఇక్కడ చాలా దెబ్బ తగిలింది. కీలకమైన మంగళగిరి నుంచి పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్ర బాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఇక్కడ పరాజయం పాలయ్యారు. దీంతో ఇంత చేసినా.. తమకు ఈ పరిస్థితి వచ్చిందేంటని.. టీడీపీ ఖంగుతింది.
అయితే..ఇప్పుడు మళ్లీ టీడీపీ పవనాలు జోరుగా వీస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ తీసుకున్న నిర్ణయమే ఆ పార్టీకి పెను శాపంగా మారిందనే అంచనాలు వస్తున్నాయి. అమరావతి రాజధానినికాదని.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం.. ఇక్కడ అగ్గిని రాజేసింది. దీంతో ఇక్కడి ప్రజలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పుంజుకుందనే సంకేతాలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న మూడు కీలక నియోజకవర్గాల్లో పార్టీకి జోష్ కనిపిస్తోంది.
ముఖ్యంగా తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ప్రజలు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆది నుంచి కూడా అమరావతికి మద్దతివ్వడం.. న్యాయ పోరాటంలో రైతులకు సాయం చేయడం.. ఇక్కడి టీడీపీ నేతలు రైతులకు అన్ని విధాలా అండగా ఉండడం వంటి పరిణామాలతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ పుంజుకుందనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. ప్రజలతోనే ఉంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటికి పరిష్కారాలను కూడా అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెదకూరపాడు టీడీపీలో గెలుపు సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉండడం.. ప్రజలను పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుండడం వంటివి ఆపార్టీకి తీవ్ర మైనస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీడీపీ పుంజుకుంటోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి అటు రాజధాని ఎఫెక్ట్.. ఇటు ఎమ్మెల్యే పనితీరుతో వైసీపీ డౌన్ అవుతుంటే.. టీడీపీ పుంజుకుంటుండడం గమనార్హం.
This post was last modified on August 21, 2022 11:04 am
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…
ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంలోనే కాదు ఏదైనా గుట్టు పసిగట్టడంలోనూ తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల…
వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు…