రాయదుర్గం వైసీపీ ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి చనిపోయాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లి మండల కేంద్రంలోని ఒక అపార్టుమెంటు ఫ్లాటు 101లో మృతుడు ఉంటున్నాడు. మృతుడి తండ్రికి ఒక నిర్మాణ సంస్ధ ఉంది. రాంకీ కంపెనీ వర్కులను ఈ నిర్మాణసంస్ధ సబ్ కాంట్రాక్టుకు తీసుకుని పనులు చేయిస్తుంటుంది. జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వర్కులు జరుగుతున్నాయి. ఈ మధ్య కొన్ని రాష్ట్రాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందలేదని సమాచారం.
వర్కులుచేసినా బిల్లులు అందకపోవటంతో మనీరొటేషన్ విషయంలో ఒత్తిళ్ళు పెరిగిపోతున్నట్లు సమాచారం. మరిపుడు తాడేపల్లిలోని తన అపార్టుమెంటుకు ఎందుకు వచ్చారో తెలీదు. అపార్టుమెంటు మైన్ టైనెన్స్ చూసే నరేంద్రరెడ్డి శుక్రవారం సాయంత్రం వచ్చేటప్పటకి లోపలవైపు తలుపులు వేసుందట. ఎంత పిలిచినా సమాధానం రాకపోయేసరికి అనుమానంతో కిటికీలలో నుండి తలుపులు తెరిచినట్లు నరేంద్ర చెప్పారు. లోపలకు వెళ్ళగానే మంచంపక్కనే నేలపైన పడున్న మంజూనాధరెడ్డి కనిపించినట్లు నరేంద్ర చెప్పారు.
దీంతో స్ధానికుల సాయంతో అంబులెన్సు పిలిపించి రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంజూనాధరెడ్డి ఎప్పుడు, ఎలా చనిపోయారన్నది సస్పెన్సుగా మారింది. ఒకవైపు చేసిన పనులకు బిల్లులు అందక మరోవైపు బ్యాంకుల నుండి ఫైనాన్స్ అందటంలేదట. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో టెన్షన్ పెరిగిపోతున్నట్లు మృతుడు తండ్రి చెప్పారు. ఈ నేపధ్యంలోనే 31 ఏళ్ళ మంజునాథ రెడ్డి చనిపోవటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రాథమిక ఆధారాలు చూస్తే ఆత్మహత్యగా చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాల్సినంతగా పరిస్ధితులు విషమించలేదని కూడా సమాచారముంది. అపార్టుమెంటు చూసుకునే నరేంద్ర ఫ్లాటు 101లోకి వెళ్ళిన కాసేపటికే అంబులెన్సు వచ్చిందని అపార్టుమెంటు కాంపౌండులోని వాళ్ళు చెబుతున్నారు. దాంతో అపార్టుమెంటులో ఏమి జరిగిందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రత్యక్ష సాక్షులు లేకపోవటం, ఆత్మహత్య చేసుకున్నారనేందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోవటంతో అందరు కన్ఫ్యూజన్లో మునిగిపోయారు. పోలీసులు కూడా ఏమీ మాట్లాడకపోవటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on August 20, 2022 6:23 pm
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…