తిరుమలలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్ హల్చల్ చేశారు. సామాన్య భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం.. రోజుల తరబడి ఎదురు చూస్తున్నా.. ఆమె ఏమాత్రం వారిని పట్టించుకోకుండా.. తన వెంట వచ్చిన 50 మంది అనుచరులకు దర్శనం కల్పించి తీరాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో విధిలేక.. సామాన్యులను క్యూలైన్లకే వదిలేసిన.. అధికారులు.. మంత్రికి, ఆమె అనుచరులకు దర్శనం కల్పించారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీయడం గమనార్హం.
వాస్తవానికి గడిచిన వారం రోజుల నుంచీ తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. దీంతో.. స్వామి దర్శనానికి ఏకంగా 40 గంటలకు పైగా సమయం పడుతోంది. ఫలితంగా.. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడం గమనార్హం. ఏకంగా 50 మంది అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనానికి వచ్చారు.
అక్కడి అధికారులు పరిస్థితి వివరించినా.. వారిపై ఒత్తిడి చేసి అనుచరులకు బ్రేక్ దర్శనాలు ఇప్పించా రు మంత్రి. మరో పది మంది అనుచరుల వరకు సుప్రభాత సేవా టికెట్లు సైతం ఇప్పించారు. మంత్రి వ్యవహార శైలిపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం తాము రోజుల తరబడి నిల్చుంటే.. మంత్రి మధ్యలో వచ్చి, వెంట జనాన్ని తీసుకొచ్చి, బ్రేక్ దర్శనాల పేరుతో దర్శనం చేసుకొని వెళ్లిపోతారా? అని మండి పడ్డారు.
మీడియాపై దూకుడు..
మంత్రి ఉష శ్రీచరణ్ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతోనూ.. మంత్రి దూకుడుగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులను తోసుకుని మరీ మంత్రి ఉష శ్రీచరణ్ వెళ్లిపోవడం గమనార్హం. దీంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. దీనిపై టీటీడీ అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం లేక పోవడం గమనార్హం.
This post was last modified on August 15, 2022 9:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…