ఇదేమీ హాట్ హాట్ పొలిటికల్ న్యూస్ కాదు. కానీ.. రాజకీయ నాయకుడి నోటి నుంచి ఉత్తినే ఏ మాటలు రావు కదా? మాట్లాడే మాటల్లో.. వేసే ప్రతి అడుగులోనూ లెక్కలు ఉండనే ఉంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన పని ఆసక్తికరంగా మారింది. చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాలు విసిరారు. ఆయనతో పాటు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ లకు కూడా చేనేత సవాలు విసిరారు. కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరించిన పవన్.. ఆయన కోరినట్లే.. చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోల్ని షేర్ చేశారు.
ఈ సందర్భంగా.. ‘రామ్ భాయ్.. మీ ఛాలెంజ్ స్వీకరించా’అని పవన్ పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేటీఆర్ తనకు విసిరిన సవాల్ ను పూర్తి చేసిన ఆయన.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చేనేత సవాల్ విసిరారు. తన సవాల్ ను స్వీకరించి.. చేనేత వస్త్రాల్ని ధరించి.. ఆ ఫోటోల్ని షేర్ చేయాల్సిందిగా కోరారు.
ఇదంతా సరదగా ఉన్నట్లు కనిపించినప్పటికీ.. దీన్ని లోతుగా చూస్తే.. కేటీఆర్ లాంటి పవర్ ఫుల్ నేత సైతం.. పవన్ కల్యాణ్ కు సవాలు విసిరిన వైనం ఆసక్తికరంగా మారింది. నిత్యం తెలంగాణవాదాన్ని వినిపిస్తూ.. తమ అధికారానికి అవసరమైన ప్రతిసారీ తెలంగాణ సెంటిమెంట్ ను బయటకు తీసే కేటీఆర్.. తాజా సవాల్ విషయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు లేకపోవటం ఏమిటి? దేనికి నిదర్శం?
తాను సవాలు విసిరే స్థాయికి సంబంధించి తెలంగాణలో ఎవరూ లేరన్నది కేటీఆర్ ఆలోచనా? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. టీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన పవన్ అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసరటం చూస్తే.. ఆయనకు బాబుతో ఉన్న దగ్గరతనంతో పోలిస్తే లోకేశ్ తో ఉన్న దూరం ఎంత ఎక్కువన్న విషయం ఇట్టే అర్థమైందంటున్నారు. ఏమైనా.. సవాల్ పేరుతో సోషల్ మీడియాలో సాగుతున్న ఈ హడావుడి వెనుక అంతర్లీనంగా రాజకీయ కోణం ఉందన్న మాట వినిపిస్తుండటం గమనార్హం.
This post was last modified on August 7, 2022 11:09 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…