బీజేపీ పాలిత ప్రభుత్వాలు.. వింత వింత పనులతో వార్తల్లో నిలుస్తున్నాయి. తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారి ఇళ్లపైకి రాత్రి వేళ ఏదో ఒక కారణం చెప్పి.. బుల్ డోజర్లు పంపించడం.. హిజాబ్ రగడలకు.. తమ వారినే ప్రోత్సహించడం .. వంటివి తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. గోమూత్రం అమ్ముతామంటూ.. బీజేపీ సర్కారు బేరం పెట్టింది.
లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేసి సబ్సిడీపై తాము విక్రయిస్తామని.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేసి పండగలు.. ఇతర కార్యక్రమాలకు విక్రయిస్తున్న ఈ సర్కరు.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించి విక్రయించనున్నట్లు పేర్కొంది.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ‘హరేలీ’ (రైతు పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకొని జులై 28న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తుండగా.. తాజాగా మూత్రాన్ని కూడా సేకరించనున్నట్లు పేర్కొంది.
రైతులు, పశుపోషకులను ప్రోత్సహించి.. గ్రామీణుల ఆదాయాన్ని పెంచేలా రెండేళ్ల కింద ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మూత్రాన్ని, పేడను అవసరమైన వారికి.. ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సర్కారు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతానికి మొదటి విడతగా జిల్లాకు రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇచ్చి.. కొనుగోలు, విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఎరువులు, క్రిమి సంహారక ఉత్పత్తుల తయారీలో గోమూత్రాన్ని వినియోగిస్తారని పేర్కొన్నారు. అంతకుముందు 2020 జులైలో ‘హరేలీ’ పండుగ నేపథ్యంలో గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కిలో ఆవు పేడను రూ.2కు కొనుగోలు చేస్తారు.
గత రెండేళ్లలో సుమారు రూ.150 కోట్ల విలువైన 20 లక్షల క్వింటాళ్ల పేడను కొనుగోలు చేశారు. దానిని 200 కోట్ల కు విక్రయించారు. ఇప్పుడు మూత్రం బిజినెస్ చేయాలని సర్కారు రెడీ కావడం గమనార్హం. మూత్రాన్ని ల్యాబ్‌లలో శుద్ధి చేసి విదేశాలకు కూడా పంపించే యోచనలో ఉన్నట్టు సర్కారు చెప్పడం గమనార్హం.
This post was last modified on July 19, 2022 3:39 pm
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…