వైసీపీ అధినేత, సీఎం జగన్ నివాసం తాడేపల్లిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఇక్కడే చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు.. పార్టీ నాయకులు కూడా ఇక్కడే సమావేశాలకు వస్తున్నారు ఈ క్రమంలో ఒక చిత్రమైన విషయంపై సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వైసీపీలో జోష్ నెలకొందని.. ఆ జోష్‌ను తగ్గకుండా చూడాలని అన్నారు. దీనికి నాయకులు స్పందిస్తూ.. ప్లీనరీ సహా..భీమవరంలో నిర్వహించిన సభలు.. జోష్ నింపాయని చెప్పారు.
కానీ.. ఆ రెండు కార్యక్రమాలు అయిపోయాయని.. ఇప్పుడు.. అలాంటి కార్యక్రమాలు లేవని.. నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. మీరు ఏం చేస్తారో తెలియదు.. నాకు మాత్రం పార్టీ లో జోష్ తగ్గిందనే మాట వినిపించకూడదని వ్యాఖ్యానించినట్టు.. వైసీపీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు వారు ఏం చేయాలనే విషయంపై తల పట్టుకున్నారు. వాస్తవానికి భీమవరంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ సభ..వైసీపీలో జోష్ పెంచింది.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్.. అంతా తానే అయి.. సభను నిర్వహించారు. దీంతో కీలకమైన బీజేపీ పొత్తు పార్టీ అధినేత, జనసేనాని పవన్‌కు కూడా ఆహ్వానం అందలేదు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును కూడా పక్కన పెట్టారు. మరోవైపు.. కాపులకు అత్యంత ఇష్టమైన చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఇదంతా కూడా జగన్‌కు.. వైసీపీకి కూడా మైలేజీ పెంచిందనే భావన వ్యక్తం చేసింది. ఇక, తాజాగా నిర్వహించిన.. నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు, మహా ప్లీనరీ కూడా పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది.
భారీ ఎత్తున జనం తరలిరావడంతోపాటు.. పార్టీలో కొత్త ఉత్సాహం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు కూడా ప్లీనరీ ఉత్సాహాన్ని కొనసాగించాలని.. ఇదే జోష్‌ను కొనసాగించాలని.. సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే.. నాయకులు మాత్రం.. ఈ రెండు కార్యక్రమాల వల్ల జోష్ వచ్చిందని.. ఇక నుంచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదని.. కాబట్టి.. జోష్ కొనసాగుతుందా? లేదా? అనేది ఎలా తెలుస్తుందని.. వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాదు.. మీరు ఏం చేసినా.. జోష్‌ను మాత్రం తగ్గించడానికి వీల్లేదని జగన్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు నాయకులు ఏం చేయాలనే విషయంపై తల పట్టుకున్నారు.
This post was last modified on July 16, 2022 10:15 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…