ఆయన సొంత నియోజకవర్గం.. ఏకంగా ప్రధాన మంత్రి స్వయంగా వస్తున్న కార్యక్రమం.. ఎన్నో ప్రయ త్నాలు.. మరెన్నో ప్రయాసలు కూడా పడ్డారు.. స్థానిక పార్లమెంటు సభ్యులు.. వైసీపీ నాయకులు.. కనుమూరి రఘురామకృష్ణరాజు. పైగా.. తమ వాడే అయిన.. మన్యం వీరుడు.. స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు.. ప్లాన్ చేసి.. నిధులు కూడా మంజూరు చేసిన ఎంపీ. అయితే.. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయన రావడం లేదు.
ఎక్కిన రైలును కూడా దిగిపోయి.. వెనక్కి వెళ్లిపోయారు. దీనికి కారణం.. ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వా నం లేకపోగా.. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోకేంద్ర పర్యటక శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి.. ఎంపీ రఘురామను ఆహ్వానించక పోవడం.. వివాదానికి దారితీసింది. వాస్తవానికి.. ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గం.. ఆయన రాకకోసం ఎదురు చూసింది. అయితే.. ప్రభుత్వానికి రాజుకు మధ్య ఏర్పడిన వివాదం తారస్థాయికి చేరింది.
అయినప్పటికీ.. ప్రోటోకాల్ మేరకు రఘురామ ఈ కార్యక్రమానికి.. పాల్గొనాలని అన్ని వైపుల నుంచి ప్రయత్నించారు. కానీ, ఎక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ప్రత్యేక భద్రతను కల్పించాలంటూ.. రఘురామ కోరిన వినతిని.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తనపై మరిన్ని కేసులు బుక్కయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన.. రఘురామ.. మౌనంగా ఉండిపోయారు. అయితే.. రఘురామ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ఇక్కడి క్షత్రియ సామాజిక వర్గం కూడా నిప్పులు చెరుగుతుండడం గమనార్హం. ఎందుకంటే.. ప్రభుత్వం వేసిన ఆహ్వాన పత్రికల్లో కేవలం.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి రోజా రెడ్డి, కిషన్ రెడ్డి తదితరుల పేర్లు వేశారు. కానీ, రఘురామరాజు పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కనీసం.. ఆయనను పిలవకపోయినా.. కనీసం.. ఆయన పేరు కూడా వేయరా? అనేది రఘురామకృష్ణరాజు.. అభిమానులు.. ఆయన అనుచరుల వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం.. ఏం చేయాలని అనుకుంటోంది? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on July 4, 2022 1:43 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…