ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర నాయకులు భీమవరం రాక నేపథ్యంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల నాలుగున అల్లూరి సీతారామ రాజు 125 వ జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడికి ప్రధాని రానున్నారు. బహిరంగ సభలో మాట్లాడనున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఇదంతా బాగుంది మోడీ రాక నేపథ్యంలోనే ట్రిపుల్ ఆర్ సంబరాలు జరగనున్నాయి. అంటే సినిమా సంబరాలు అని కాదు ఎంపీ రఘురామ రాక నేపథ్యంలో సంబరాలు జరగనున్నాయి. ఎన్నో ఏళ్ల తరువాత ఇటుగా వస్తున్న తిరుగుబాటు ఎంపీ రఘురామను అరెస్టు చేసేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం అయిన వైఖరి ఒకటి ఏపీ పోలీసు ఎదుట వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చింది.
కానీ ఇవి అమలు అవుతాయా లేదా అన్నదే సందిగ్ధం. అప్పటికప్పుడు ఎంపీ పై కేసులు నమోదు చేసి సర్కారు కక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించేందుకు వీల్లేదని కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు రెబల్ ఎంపీ రాకపైనే వివాదాలు ఉన్నాయి. రాక తరువాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో అన్న ఉత్కంఠతలూ నెలకొని ఉన్నాయి. మోడీ ఎదుట రఘురామ పరువు ఏపీ పోలీసులు తీయరు కదా ! అనే సందేహాలూ సంబంధిత వర్గాల్లో వస్తున్నాయి.
ఇప్పటికే శిలాఫలకంపై తన పేరు ఉంచాలని పదే పదే వేడుకున్నారు ఎంపీ రఘురామ. అల్లూరి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఏర్పాటుచేసే శిలాఫలకంపై తన పేరు ఉంచాలన్నది ఆయన డిమాండ్. ఈ ప్రాంతంకు చెందిన ఎంపీని తాను అని కనీసం ప్రొటొకాల్ అయినా పాటించాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదం కానుంది. ఇప్పుడు శిలాఫలకం పై పేరు ఉంచుతారా లేదా రాజకీయంలో భాగంగా లేకుండా చేస్తారా?
మరోవైపు ఆర్ఆర్ఆర్ రాక నేపథ్యంలో భీమవరం క్షత్రియులు భారీ ఎత్తున స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై నిరంతరం పోరు సాగిస్తున్న వైనాన్ని తాము స్వాగతిస్తున్నామని పలువురు బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయనేమీ షో చేయడం లేదని, నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారని పలువురు పొగుడుతున్నారు. ఇవన్నీ వైసీపీకి కంటగింపుగానే ఉన్నాయి. వైసీపీ కౌంటర్లు ఇంకా మొదలు కాకపోయినా, సాయిరెడ్డి నుంచి ఎటువంటి మాటల తూటాలు వస్తాయో అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
This post was last modified on July 2, 2022 5:10 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…