బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని.. బీజేపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. వేరే పార్టీలతో తమకు అవసరం కూడా లేదని చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, జనసేన వైపు నుంచే అనేక సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ రంగంలోకి దిగింది. అయితే.. ఇదే స్థానం నుంచి జనసేన పోటీకి దూరంగా ఉంది. నిజానికి ఇప్పటికి రెండు సార్లు రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగ్గా.. ఒక్కసారి కూడా బీజేపీ .. తమ పొత్తుపార్టీ అని చెప్పుకొనే జనసేనకు అవకాశం ఇవ్వలేదు.
గతంలో తిరుపతి, బద్వేల్‌లోనూ బీజేపీ పోటీ చేసింది. తిరుపతి విషయంలో తొలుత జనసేన పోటీ చేస్తానని చెప్పినా.. పట్టుబట్టి.. బీజేపీ పోటీ చేసింది. ఇక, ఇప్పుడు కూడా జనసేన పోటీకి దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ.. పొత్తు పార్టీ బీజేపీ మాత్రం పోటీకి దిగింది. అంతేకాదు.. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేసే సమయంలో.. జనసేన నాయకుడు ఇక్కడ తమ తరఫున ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడా క్లారిటీ రాలేదు. అంతేకాదు.. జనసేన జెండాలు కూడా బీజేపీ వెంట కనిపించడం లేదు.
దీంతో అసలు బీజేపీ పక్షాన జనసేన ప్రచారం చేస్తుందా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. ఆత్మకూరు నియోజకవర్గంలో.. మెగా అభిమానులు ఎక్కువని.. వారంతా తమ వెంటే ఉంటారని.. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. కానీ, మెగా కుటుంబం మాట ఎలా ఉన్నప్పటికీ.. పవన్ మాత్రం తన అభిమానులకు కూడా ఎలాంటి సందేశం పంపించలేదు. దీంతో ఇక్కడ బీజేపీకి మద్దతు పలికే జనసేన నాయకులు కనిపించలేదు. మరోవైపు.. అసలు బీజేపీ తరఫున కూడా పెద్దగా ఎవరూ ప్రచారం చేయడం లేదు. దీంతో ఇక్కడ బీజేపీ ఓటమి రాసిపెట్టుకున్నట్టు అయింది.
గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ.. అసలు జనసేన.. బీజేపీ పొత్తులో ఉన్నాయా? లేవా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో కలిసి వెళ్లాలని.. జనసేన ప్రయత్నాలు చేస్తుంటే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ససేమిరా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన ఇప్పుడు.. ఆత్మకూరు ప్రచారానికి సైతం దూరంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదెలా చూసినా.. పొత్తు మాటల మాటున బీజేపీ పైచేయి సాధించే ప్రయత్నాలు చేయడం గమనార్హం.
This post was last modified on June 20, 2022 10:45 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…