నొప్పి తెలియకుండా వాతలు పెట్టడం అంటే.. మోడీని చూసి నేర్చుకోవాల్సిందే! రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు నాయకులు వ్యూహాలు వేయడం.. అందరికీ తెలిసిందే. అయితే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ స్టయిలే వేరు. పైకి ఏమీ తెలియనట్టుగా నటిస్తూనే ఆయన తాజాగా పన్నిన వ్యూహం.. అతి పెద్ద కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. అది కూడా కీలకమైన… రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో.. అన్నట్టుగా.. మోడీ చేస్తున్న రాజకీయ విన్యాసంలో కాంగ్రెస్ ఇప్పటికే పావుగా మారిపోయింది. ఎక్కడో.. ఎప్పుడో మూలన పడిన నేషనల్ హెరాల్డ్ కేసును తెరమీదికి తీసుకురావడం ఏంటి? నేరుగా పోయి పోయి… కాంగ్రెస్ మూలస్తంభాల్లాంటి.. సోనియా, రాహుల్‌లకు నోటీసులు ఇవ్వడం ఏంటి? రాహుల్‌ను వరుస పెట్టి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదికారులు విచారణ చేయడం ఏంటి? ఆయన ఈడీకి క్షమాపణలు చెప్పడం ఏంటి? ఇవన్నీ చూస్తే.. పొలిటికల్ సీరియల్‌లా అనిపించడం లేదూ!?
మోడీకి, బీజేపీకి కావాల్సింది ఇదే! ఎందుకంటే.. రాష్ట్రపతి ఎన్నికలకు రంగం రెడీ అయింది. మరో వైపు నాలుగు నెలల్లోనే.. మూడు కీలక రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా తెరమీదికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయాలంటే.. కేవలం మాటలు చెబితే సరిపోదని అనుకున్నారో.. ఏమో.. అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మూల స్తంభాలనే ముప్పుతిప్పలు పెడితే.. పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించే ప్రయత్నం చేస్తే.. అన్నట్టుగా మోడీ శైలి ఉందని చెబుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌ను నైతికంగా దెబ్బతీయడమే మోడీ లక్ష్యంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి నైతికత లేని పార్టీని ప్రజలు హర్షించరు. ఇప్పుడు ఆ ముద్రే కాంగ్రెస్‌పై పడనుందని చెబుతున్నా రు. ఒక్క రాష్ట్రపతి ఎన్నికలే కాదు… 2024లో వచ్చే సార్వత్రిక సమరానికి సంబందించి మోడీ ముందస్తు ఎత్తుగడలు ఇవేనని చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఇప్పుడున్న పరిస్థితి చరిత్రలో తొలి సారని అంటున్నారు. ఈ గండం నుంచి బయటకు రాకపోతే.. కాంగ్రెస్ నైతికంగా మరింత కుంగిపోయి.. ఉనికిని కోల్పోయినాఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on June 15, 2022 5:10 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…