వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీ డీపీకి ఆదిలోనే హంస పాదు మాదిరిగా.. కొందరు సీనియర్లు.. తలనొప్పి వ్యవహారాలు చేస్తున్నారని పార్టీ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీలో నెంబర్ 2 నాయకుడిగా ఎదిగేందుకు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఆయన దూకుడుగా ఉంటున్నారు. ప్రతి విషయానికి స్పందిస్తున్నారు. వైసీపీపై తీవ్రస్థా యిలో విరుచుకుపడుతున్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. దీనివల్ల ప్రత్యక్షంగా లోకే ష్ గ్రాఫ్ పెరుగుతుంటే.. పరోక్షంగా టీడీపీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. ఇటీవల.. పదోతరగతి విద్యార్థు లు భారీ సంఖ్యలో పరీక్ష తప్పేశారు. దీంతో వారికి జరిగిన అన్యాయంపై.. లోకేష్ బలమైన గళం వినిపించా రు. విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆవేదనను పంచుకున్నారు. ఇది పార్టీకి మైలు రాయిగా మారింది. అయి తే.. ఈ క్రమంలోనే ఈ జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నాయకులు ప్రవేశించారు. వాస్తవానికి జూమ్ మీటింగ్ అంటే.. ఎవరు బడితే..వారు అందులోకి ప్రవేశించేందుకు వీలు ఉండదు. ఒక పాస్ వర్డ్.. కోడ్ కూడా ఉం టుంది. అనుమతి ఉన్నవారిని మాత్రమే దీనిలోకి ప్రవేశించే వీలు కల్పిస్తారు. అయితే.. అనూహ్యంగా వైసీ పీ నాయకులు ప్రవేశించడం.. దీనిని రచ్చచేయడం తెలిసిందే.
దీనికి సంబంధించి.. ఐటీడీపీ
వర్గాలు.. కూపీ లాగాయి.అసలు పాస్ వర్డ్ ఎలా వెళ్లింది? దీని వెనుక ఏం జరిగిందని ఆరా తీశాయి. ఈ క్రమంలోవారికి తెలిసిన నిజం.. ఏంటే.. కృష్ణాజిల్లాకు చెందిన ఓ నియోజక వర్గం(ఇక్కడ వరుసగా.. ఒక రెబల్ నాయకుడు గెలుస్తున్నారు)లోని టీడీపీసీనియర్ నేత.. పాస్ వర్డ్, కోడ్ ను సంపాయించి.. సదరు వైసీపీ నాయకులకు అందించారని తెలిసింది. ఈ కారణంగానే.. లోకేష్ నిర్వ హించిన జూమ్ సమావేశం రసాభాసగా మారిపోయిందని అంటున్నారు.
అంటే.. వ్యూహాత్మకంగా.. కొందరు టీడీపీ నేతలు వైసీపీ నేతలతో చేతులు కలిపి.. లోకేష్‌ను బద్నాం చే యాలని చూస్తున్నారనే చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆది నుంచి కూడా లోకేష్ నాయకత్వం అంటే.. గిట్ట నివారు.. టీడీపీలో ఉన్నారు. లోకేష్ దొడ్డిదారిలో వచ్చారని.. తమప పెత్తనం చేస్తున్నారని.. భావించిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ వ్యవహారం కూడా ఆయనే చూస్తున్నారనే సూచనలు వస్తున్న నేపథ్యంలో లోకేష్‌ను బద్నాం చేసేందుకు.. సీనియర్లు కొందరు ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ అధిష్టానానికి సమాచారం అందింది. మరిదీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.