జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చూసిన తర్వాత అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాదెండ్ల మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 5వ తేదీ నుంచి అంటే విజయదశమి నుంచి యాత్ర మొదలుపెడతారని ప్రకటించారు. తిరుపతి నుండి మొదలయ్యే యాత్రలో ఆరు మాసాల్లో రాష్ట్రమంతటా చుట్టేస్తారట. ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ యాత్ర అన్నారే కానీ పాదయాత్ర లేకపోతే బస్సుయాత్రా అనేది చెప్పలేదు. పైగా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో రాష్ట్రంలో కచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని కూడా నాదెండ్ల చెప్పారు. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయంటే ఈ డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేయాల్సుంటుంది. ఇంత హఠాత్తుగా యాత్ర నిర్ణయాన్ని పవన్ తీసుకోవటం దాన్ని నాదెండ్ల ప్రకటించటం ఆశ్చర్యంగానే ఉంది.
ఇదంతా చూస్తుంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ప్రకటనే కారణమని అనుమానంగా ఉంది. ఢిల్లీలో శుక్రవారం రఘురాజు మీడియాతో మాట్లాడుతు ఈ డిసెంబర్లో అసెంబ్లీ రద్దుకు జగన్మోహన్ రెడ్డి సిఫారసు చేస్తారని, వచ్చే మార్చి, ఏప్రిల్లో ముందస్తు ఎన్నికలు జరగవచ్చని చెప్పారు. బహుశా దాన్ని పట్టుకునే పవన్ ముందస్తు ఎన్నికల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు అర్ధమవుతోంది. గతంలో పవన్ పాదయాత్రపై మాట్లాడుతూ తాను జనాల్లోకి రావటం కష్టమన్నారు.
తాను కనుక పాదయాత్ర పేరుతో జనాల్లోకి వస్తే కచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు. తనకోసం వచ్చే జనాలను ప్రభుత్వం కంట్రోల్ చేయలేదని చెప్పారు. మరిపుడు పాదయాత్ర చేస్తార లేకపోతే బస్సుయాత్ర చేద్దామని అనుకుంటున్నారో క్లారిటీ లేదు. నాదెండ్ల మాట్లాడుతూ రాబోయే ముందస్తు ఎన్నికలకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. పవన్ తాజా నిర్ణయంతో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఎన్నికల వేడి మాత్రం అమాంతం పెరిగి పోవడం ఖాయం. పైగా యాత్ర కూడా వచ్చే మార్చి, ఏప్రిల్ అంటున్నారు. అంటే భగభగ మండిపోయే ఎండల్లో అన్నమాట. తిరుపతిని ఎంపిక చేసుకోవడం వెనుక ఇక్కడినుండే పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. చూద్దాం చివరకు ఏమిచేస్తారో.
This post was last modified on June 11, 2022 9:53 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…