జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చెదిరిపోకుండా.. చూస్తాననని పదే పదే చెబుతున్న పవన్.. ఇప్పుడు ఈ విషయంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరుసగా.. ఆయన పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన నిశితంగా గమనిస్తున్నారు.. ముఖ్యంగా అందివచ్చిన అవకాశాలను వదులు కోకుండా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల జరిగిన కోనసీమ రగడను ఆయన ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీనివల్ల కాపుల్లో ప్రభుత్వం చిచ్చు పెట్టాలని చూస్తోందని.. కాపుల ఓటు బ్యాంకును చెదిరిపోయేలా చూస్తోందన్నది.. పవన్ తాలుకూ ప్రధాన ఆరోపణ. అదే సమయంలో పవన్ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని.. ఎప్పటి నుంచో విమర్శలు వున్నాయి. మరోవైపు … పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నిజానికి చెప్పాలంటే.. ఇతర పార్టీలకు లేని… యువ నాయకత్వం.. పవన్‌కు లభించింది. ఆయన అభిమానులే.. ఆయనకు బలమైన శక్తిగా మారే అవకాశం ఉంది. ఇది గత ఎన్నికల్లో పవన్ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా… ఆయన ఆయా అంశాలపై దృష్టి పెట్టాలని.. తనకు అనుకూలంగా ఉన్న వర్గాలను.. ముఖ్యంగా అబిమానులను తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా.. అవి కేవలం నామ్ కేవాస్తే.. అన్నట్టుగా ఉండకూడదనేది ఆయన ఉద్దేశం.
ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని.. తాజాగా జనసేనాని నిర్ణయించుకన్నట్టు సమాచారం. పార్టీకి బలమైన జిల్లాలుగా ఉంటాయని లెక్కలు వేసుకున్న శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు వంటి వాటిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని పవన్ దూసుకుపోయేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అయితే.. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలుస్తారా? పార్టీ వరకే పరిమితం అవుతారా? అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా… జనసేన అధినేత.. చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయితే.. పార్టీకి కొత్త రూపు వస్తుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates