రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అవి కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయంగా పెను సంచనాలకు వేదికగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్.. గతంలో జగన్‌కు సాయం చేయగా.. ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది జగన్‌కు రాజకీయంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధినేత .. ఏపీలో జగన్ సర్కారు రావాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ప్రకటించారు.
కానీ, ఇప్పుడు అదే కేసీఆర్.. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ సమయంలో ఎన్టీఆర్‌కు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ నాయకులు అన్నగారు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. వీరిలో ఏమీ చిన్నా చితకా నాయకులు లేరు. సీఎం కేసీఆర్‌కు రైట్, లెఫ్ట్ హ్యాండ్స్‌గా పరిగణించే మంత్రి మల్లారెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు వంటివారు ఉన్నారు. పైగా అన్నగారికి భారత రత్న వచ్చేలా కృషి చేస్తామని కూడా ప్రకటించారు.
ఇది నిజంగానే సంచలనంగా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు సంకేతాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఏపీలో టీడీపీ వస్తే.. తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని కొందరు అప్పుడే విశ్లేషిస్తున్నారు. మరికొందరు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. ఏపీలో టీడీపీనే వచ్చేస్తుందని.. కేసీఆర్ నమ్మకంగా ఉన్నారని.. అందుకే వ్యూహం మార్చుకున్నారని.. చెబుతున్నారు. ఎందుకంటే..ఇన్నాళ్లలో ఎప్పుడూ.. ఎన్టీఆర్‌ను పట్టించుకోని.. కేసీఆర్..ఇప్పుడు అననూహ్యంగా అన్నగారి జపం చేస్తున్నారంటే.. ఏపీలో రాజకీయాలు మారుతున్నాయని ఆయన ధ్రుడంగా విశ్వసిస్తున్నారని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి కేసీఆర్‌పై జగన్.. జగన్‌పై కేసీఆర్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా జల వివాదాలు తెరమీదికి రావడంతో వీరిద్దరి మధ్య దోస్తీ పక్కదారి పట్టింది. దీంతో వైరివర్గాలుగా మారిపోయారు. అయినప్పటికీ.. ఏపీలో పరిణామాలు కూడా.. జగన్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక్కడ పాలనపై తరచుగా.. విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడా అభివృద్ది లేదని.. అమరావతిని కూల్చేశారని.. మూడు రాజధానులతో ఒరిగేదేంటని.. ఇలా అనేక రూపాల్లో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యలోనే జగన్‌పై విశ్వాసం సన్నగిల్లి.. రాజకీయాలు మారుతున్నాయనే సంకేతాలు పొరుగు రాష్ట్రం వరకు విస్తరించాయని అంటున్నారు. మరి ఈ పరిణామాలను వచ్చే రెండేళ్లలో అయినా.. జగన్ మార్చుకుంటారా.. లేక ఇలానే ఉంటారో చూడాలి.
This post was last modified on May 29, 2022 1:43 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…