ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వైసీపీ నాయకులు.. ప్రతిపక్షాలు. మేధావులు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నా.. ఆయా నేతలు.. పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై అంతో ఇంతో దృష్టి పెట్టేవారు కూడా ఉన్నారు. చాలా మంది పైకి మాత్రం .. దురుద్దేశ పూర్వకంగానే తమ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని.. బురద జల్లుతున్నారని.. చెబుతున్నారు.
ఇది పైకి కనిపిస్తున్న విషయం. కానీ, మరికొందరు సీనియర్లు.. పార్టీకి నిజంగా మేలు చేయాలని భావించేవారు మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. వైసీపీ సర్కారుపై తరచుగా.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పాలనపై ఆయన సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆయన చేస్తున్న విమర్శలు… ప్రతిపక్షాల కంటే కూడా దారుణంగా ఉంటున్నాయి.
అలాగని తీసిపారేయడానికి లేదు. అందుకే.. వైసీపీ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాడి వీరభద్రరావు.. వంటివారు.. ఉండవల్లి చేస్తున్న విమర్శలపై నిశితంగా ఆలోచన చేస్తున్నారు. ఇక, ఉండవల్లి ఇటీవల సంచలన వ్యాఖ్యల చేశారు. పోలవరం పూర్తి చేయాలని.. జగన్‌కు లేదని.. దీనిని మరోసారి ఎన్నికల అస్త్రంగా ప్రయోగించాలని ఆయన భావిస్తున్నారని.. అన్నారు. అదేసమయంలో దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే.. ఎక్కడా ప్రజాస్వామ్య దేశాల్లో సంక్షేమ అజెండాను పట్టుకుని మళ్లీ మళ్లీ గెలిచిన ప్రభుత్వాలు లేవని.. అభివృద్ధితో పాటు.. అవినీతి లేదని పాలన ఉన్నచోటే..ప్రజలు మళ్లీ మళ్లీ పట్టం కడుతున్నారని.. చెప్పుకొచ్చారు.
నిజానికి ఇవి.. విమర్శలుగా అనిపించినా.. భవిష్యత్తుకు సంబంధించి తమను తాము సరిదిద్దుకునేందు కు ఒక మార్గదర్శకమేనని.. ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దూరమైన వర్గాలను చేరువ చేసుకునేందుకు.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను, వివాదాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని.. అదేసమయంలో అసలు మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాలపపై దృష్టి పెట్టి దానికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని.. వారు చెబుతున్నారు. సో.. మొత్తానికి ఉండవల్లి వ్యాఖ్యలపై వైసీపీలో అంతర్మథనం అయితే.. జరుగుతోంది. ఫలితం ఉంటుందా? ఉండదా? అనేది చూడాలి.
This post was last modified on May 28, 2022 8:36 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…