Political News

రెండు, మూడు నెల‌ల్లో సంచ‌ల‌న వార్త: కేసీఆర్

బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సుమారు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. జాతీయ, కర్ణాటక రాజకీయాలతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్‌, సాగు నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని చెప్పారు.

ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గతంలో కర్ణాటకకు వచ్చినప్పుడు తాను చెప్పిన మాట నిజమైందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకకు వచ్చిన సమయంలో.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పి వెళ్లానని.. అది అక్షరాల నిజమైందని వివరించారు. ఇప్పుడు కూడా జాతీయస్థాయిలో పెనుమార్పు రాబోతోందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు నెలల్లోనే ఓ సంచలన వార్త చెప్తామన్నారు.

“ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. మహిళలు, యువత సహా ఎవరీలోనూ ఆనందం లేదు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయింది. జీడీపీలో భారత్‌ను చైనా అధిగమించింది. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుంది. దేశంలో వచ్చే మార్పును ఎవరూ ఆపలేరు. జాతీయ, కర్ణాటక రాజకీయాలపై మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చించాం. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెప్తాం.“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

This post was last modified on May 26, 2022 7:23 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago