నిన్నటిదాకా సూర్య దర్శకుడు బాలా కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి హీరోనే స్వయంగా చెక్ పెట్టాడు. ఇందాకా ట్విట్టర్ లో వి ఆర్ బ్యాక్ టు ది సెట్స్ (మేము షూటింగ్ కి వచ్చేసాం)అనే క్యాప్షన్ పెట్టి బాలాతో ఉన్న ఫోటో పోస్ట్ చేయడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్ గురించి తమిళనాడు ప్రధాన మీడియాలోనే చాలా కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగానే మనవాళ్ళు సైతం ఇది నిజమే అనుకున్నారు. కట్ చేస్తే కేవలం గంటల వ్యవధిలో సూర్య క్లారిటీ ఇచ్చాడు.
దీంతో కల్ట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికీ ఈ కాంబో అంటే గుర్తొచ్చే మూవీ పితామగన్. విక్రమ్ తో కలిసి సూర్య అందులో ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎవరూ మర్చిపోలేరు. అంతకు ముందు బాలాతో నంద చేసినప్పటికీ శివపుత్రుడు ఇచ్చిన బ్రేక్ వేరే లెవెల్. అందుకే ఇది ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్య జ్యోతికలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ డిఫరెంట్ జానర్ మూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
కాకపోతే ఒకటే రిస్క్ ఉంది. బాలా చాలా కాలం నుంచి ఫామ్ లో లేరు. అర్జున రెడ్డి రీమేక్ వర్మని దారుణంగా తీశారని విక్రమ్ అదేపనిగా వేరే దర్శకుడితో కొత్త వెర్షన్ తీయించడం అప్పట్లో బాలాకు జరిగిన అవమానంగా ఫ్యాన్స్ ఫీలయ్యారు. దీనికన్నా ముందు వాడే వాడు, నేను దేవుణ్ణి, పరదేశి లాంటివి టెక్నికల్ గా ఎంత గొప్ప ప్రశంసలు అందుకున్నప్పటికీ వాటిలో ఉన్న ఓవర్ వయొలెన్స్ వల్ల అన్ని వర్గాలను మెప్పించలేకపోయాయి. మరి సూర్య తనకిచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని బాలా ఎలా వాడుకుంటారో చూడాలి
This post was last modified on May 26, 2022 6:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…