టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తనపై చేసిన ఆరోపణలను మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. రేవంత్ రెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. టీడీపీలో ఉన్ననాటి నుంచి రేవంత్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ.. డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. భూములు చట్టబద్ధంగానే కొన్నానని… లీగల్‌గా వెళ్లి రేవంత్‌ను జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు.
రేవంత్ బిడ్డ పెళ్లికి తానే డబ్బులు ఇచ్చానని… యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా తాను డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ రువ్వారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి రేవంత్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తాను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి అడుగడుగునా తనను బ్లాక్‌మెయిల్ చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తను విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయం కోసం భూములు కొన్న విషయం వాస్తవమే అయినా.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నేను ఎక్కడా భూములను ఆక్రమించుకోలేదు. నా విద్యాసంస్థలు, యూనివర్సిటీల కోసం చట్టబద్ధంగానే భూములను కొన్నా. రేవంత్‌రెడ్డి అడుగడుగునా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నడు. ఇద్దరం టీడీపీలో ఉన్న సమయంలోనూ రేవంత్ నన్ను వదల్లేదు. మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం ఇద్దరికీ పోటీ ఉండేది. సీటు జోలికొస్తే కాలేజీలు మూయిస్తానని బెదిరించిండు. ఆయన కుమార్తె వివాహం ఖర్చులకు నేనే డబ్బులిచ్చిన. అందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై ప్రమాణం చేయడానికి రేవంత్ సిద్ధమేనా..” అని ప్రశ్నించారు.
కేటీఆర్ దావోస్ వెళ్తే.. రాహుల్ నైట్ క్లబ్‌లకు
రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండరని.. రేపు బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే 2024లో ప్రాంతీయ పార్టీలతో కలిసి సీఎం కేసీఆర్ దేశాన్ని పాలించడం ఖాయమని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పెట్టుబడుల కోసం దావోస్ వెళితే రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లోకి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
This post was last modified on May 24, 2022 5:05 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…