Political News

హైదరాబాద్ కు మోడీ.. ఢిల్లీకి కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోపాన్ని భరించటం చాలా కష్టం. ఆయన ఒకసారి ఆగ్రహించటం మొదలు పెడితే..దాన్ని అక్కడితో ఆపరు. ఆయన ఆ పనిని నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన అనుగ్రహం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. ఆగ్రహం అంతటి వేదనకు కారణమవుతుంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారంగా మారటం.. కాలం ఆయనకు అనుకూలంగా ఉండటంతో ఆయనేం చేసినా.. ఆయనకు మేలు చేస్తుంటే.. ఆయన ప్రత్యర్థులకు మాత్రం ఇక్కట్లను తెచ్చి పెడుతోంది. కొంతకాలంగా కేంద్రంలో ఏర్పడిన పంచాయితీతో దూరం పెరగటం తెలిసిందే.

దీంతో.. మోడీ సర్కారు మీదా.. ప్రధాని మోడీ మీదా సీఎం కేసీఆర్ కస్సుమంటున్నారు. ఇదొక్క కేసీఆర్ తో ఆగకుండా.. ఆ బాధ్యతను తన రాజకీయ వారసుడు.. మంత్రి కేటీఆర్ కు అప్పజెప్పటం తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా కేంద్రం మీదా.. ప్రధాని నరేంద్ర మోడీ మీదా ఆయన ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ టూర్ తో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు సీఎం కేసీఆర్ కార్యాచరణను సిద్ధం చేసుకోవటం.. శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లటం తెలిసిందే.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇంతకాలం వెళ్లని ఆయన.. ఇప్పుడే ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర వాదన వినిపిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్ లోని ఐఎస్ బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ద్విశతాబ్ది కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. సాధారణంగా దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే.. సీఎం స్వాగతించటం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రావటం.. ఆ సమయంలో ఆయన దూరంగా ఉండటం తెలిసిందే.

అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు సైతం సీఎం హోదాలో కేసీఆర్ హాజరు కాకుండా.. తన తరఫున ఎవరో ఒక మంత్రిని.. అధికారిక టీంలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని మోడీ వస్తున్న వేళ.. ఆయన హాజరయ్యే కార్యక్రమానికి హాజరు కావటంతో పాటు.. ఆయనకు స్వాగతం పలకటం ఇష్టం లేకనే.. సీఎం కేసీఆర్ తన తాజా షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.

దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని కొన్ని నెలల నుంచి వాదనలు వినిపిస్తున్న ఆయన.. దాని కార్యాచరణకు హటాత్తుగా ముహుర్తం డిసైడ్ చేసి.. ఢిల్లీకి పయనం కావటం వెనుక రాష్ట్రానికి మోడీ వస్తుండటమే ప్రధాన కారణమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ వస్తుంటే.. అంతకు కొద్ది రోజుల ముందే ఢిల్లీకి వెళుతున్న సీఎం కేసీఆర్.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరై ఢిల్లీకి వెళ్లిన తర్వాతి రోజున సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తిరిగి రానుండటం గమనార్హం.

This post was last modified on May 21, 2022 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

6 hours ago