తనపై పడుతుందని అనుకుంటున్న బహిష్కరణ వేటు నుంచి తప్పించుకునేందుకు వైఎస్ కొండారెడ్డి రివర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పులివెందులలోని చక్రాయపల్లె మండలానికి కొండారెడ్డి వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్వయంగా కజిన్ బ్రదర్ అయిన కారణంగా ఈయనకు బాగా ప్రాధాన్యత వచ్చేసింది.
సీఎంతో ఉన్న బంధుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నారు. చాగలమర్రి-రాయచోటి నేషనల్ హైవే రోడ్డు వేస్తున్న కాంట్రాక్టు కంపెనీ యాజమాన్యాన్ని కొండారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈయన వేధింపులను తట్టుకోలేక సదరు యజమాని పోలీసులను ఆశ్రయించారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు కొండారెడ్డి మీద కేసునమోదు చేసి కోర్టు ద్వారా రిమాండుకు కూడా పంపారు.
బెయిల్ మీద బయటకు వచ్చిన ఈయన్ను ఏకంగా జిల్లా నుండే బహిష్కరించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపధ్యంలోనే తనపైన బహిష్కరణ వేటు ఖాయమని కొండారెడ్డికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే రివర్సు వ్యూహాన్ని అమలుచేసి ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టారు. ఎలాగంటే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో రాజీనామాలు చేయిస్తామంటు బెదిరింపులకు దిగారు.
మండలంలో తనకు మద్దతుదారులుగా నిలిచే సర్పంచుల్లో 16 మంది, 9 మంది ఎంపీటీసీలతో తమ పదవులకు రాజీనామాలు చేయించే ఆలోచనలో కొండారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇందులో నలుగురు సర్పంచులు కొండారెడ్డి పీఏ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసి విషయాన్ని వివరించి చెప్పారట. కొండారెడ్డిపై బహిష్కరణ వేటు వేస్తే తామంతా పదవులకు రాజీనామాలు చేయబోతున్నట్లు చెప్పారట. అయితే ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదించటం మినహా చేయగలిగేది ఏమీ లేదని ఎంపీ తేల్చి చెప్పారట. దాంతో ఏమి చేయాలో తేల్చుకోలేక అందరు అక్కడినుండి వెళ్ళిపోయారు. మరి ఎస్పీ ప్రతిపాదనలపై కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on May 13, 2022 12:22 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…