బెదిరింపుల కేసులో రెండు రోజుల క్రితమే అరెస్టయిన వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా నుండి బహిష్కరించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డికి కొండారెడ్డి కజిన్ బ్రదర్ అవుతారు. వైఎస్ కుటుంబానికి ఈయన అత్యంత సన్నిహితుడు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి పార్టీ తరపున ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. పేరుకు మండల ఇన్చార్జే కానీ జిల్లాలోని చాలాప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.
రాయచోటి-వేంపల్లి రోడ్డు పనులు చేస్తున్న ఎస్ ఆర్కె కంపెనీని డబ్బుల కోసం బెదిరించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. కంపెనీ ప్రతినిధులు ఈయన బాదలు పడలేక జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు. అంతర్గతంగా విచారణ జరిపిన ఎస్పీ బెదిరింపులు నిజమే అని నిర్ధారించుకున్నారు. అయితే వెంటనే యాక్షన్ తీసుకోవటానికి వెనకాడారు. కారణం ఏమిటంటే జగన్ కు కజిన్ బ్రదర్ కావటమే కారణం.
ఇదే విషయాన్ని ఎస్పీ ఉన్నతాధికారులకు చేరవేయగా అక్కడి నుండి ఇదే విషయం జగన్ దగ్గరకు చేరింది. దాంతో జగన్ వెంటనే స్పందించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలే అది తీసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొండారెడ్డిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు ఈయనకు రిమాండ్ విధించింది. బుధవారమే కొండారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు.
బెయిల్ పై బయటకు వచ్చినా కొండారెడ్డి వ్యవహారంలో ఎలాంటి మార్పు ఉండదని నిర్ణయానికి వచ్చిన ఎస్పీ ఏకంగా జిల్లా బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించే విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు గట్టి ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ కు పంపారని సమాచారం. ఎస్పీ అన్బురాజన్ నుండి వచ్చిన ప్రతిపాదనను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ఓకే అనుకుంటే వెంటనే కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు పడుతుందని సమాచారం. చక్రాయపేట పోలీసుస్టేషన్ పరిధిలో కొండారెడ్డిపై ఐపీసీ 386, ఐపీసీ 506 సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. మరి కలెక్టర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
This post was last modified on May 12, 2022 4:13 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…