ఎల్లుండి నుంచి మరో ప్రత్యేక రీతిలో వైసీపీ కనిపించనుంది. సామాన్య రీతిలో ఉన్నజనానికి ఈ ప్రత్యేక రీతి చేరువ అవుతుందో లేదో కానీ ఎట్టకేలకు జగన్ తన మార్కు పాలనలో ఉన్న లోపాలు, మంచి చెడులు అన్నవి తెలుసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా తనవారిని సన్నద్ధం చేస్తున్నారు. అధికారం దక్కి మూడేళ్లయిన నేపథ్యంలో ఓ విధంగా ఆర్థికంగా తలనొప్పులు ఎన్ని ఉన్నా వాటిని దాటుకుని ప్రయాణిస్తున్న వైనం పై కొన్ని విమర్శలున్నా, ఏ మాటకు ఆ మాట తాను చేయాల్సిందేదో చేస్తూనే ఉంటానని జగన్ చెబుతున్నారు. పాలన పై స్పష్టమైన అభిప్రాయం ఏంటన్నది ప్రజల నుంచి తెలుసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు జగన్.
ఆ విధంగా వైసీపీ సర్కారుకు కొద్ది రోజుల్లో గ్రౌండ్ లెవల్ రియాల్టీ ఏంటన్నది తెలిసిపోనుంది. మే 11 (బుధవారం) నుంచి ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాల పరిధిలో రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలూ, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు. పథకాల అమలు తీరు గురించి తెలుసుకోనున్నారు. పథకాలను అందుకున్న లబ్ధిదారులతో మాట్లాడడున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. స్థానిక వ్యతిరేకతను ఏ విధంగా నిలువరించగలరు ?
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా, గోపాలపురం ఎమ్మెల్యేపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఓ హత్యోదంతంలో ఆయన అనుచరుల పాత్ర ఉందని అభియోగం చేస్తూ ఎమ్మెల్యేను అనరాని మాటలు అని పిడి గుద్దులు కురిపించారు. ఆ రోజు ఏదో ఒక విధంగా పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డారు. అదేవిధంగా కర్నూలులో కూడా ప్రజావ్యతిరేకత అన్నది తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ కూడా ఇదే తరహా ఘటనలు జరిగేయి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటిదాకా పర్యటించని గ్రామాలున్నాయి. సందర్శించని కాలనీలు ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఉన్నా చాలా చోట్ల స్థానిక సమస్యలను పరిష్కరించని యంత్రాంగం ఉంది. యాంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఎమ్మెల్యేలు మరింత పరువు పోగొట్టుకుంటున్నారు కూడా !
ముఖ్యంగా చెత్త పన్ను వసూలు తమకు ఓ తలనొప్పిగా ఉందని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. అంతేకాదు ముందస్తు ఆస్తిపన్ను వసూలు కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. పెంచిన పన్నులు, విద్యుత్ ఛార్జీలు కూడా జనామోదం పొందేలా లేవు.
ఒక వైపు సంక్షేమం అంటూనే మరోవైపు పన్నుల వడ్డన చేయడం ఏమంత భావ్యం కాదని ప్రజలు విపక్ష నేతల ఎదుట గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే టీడీపీ చేపడుతున్న బాదుడే బాదుడు కార్యక్రమ ప్రభావం జనంపై విపరీతంగా ఉంది. ఈ దశలో క్షేత్ర స్థాయిలో పోలీసుల సహకారం ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకతలను నిలువరించడం సాధ్యం కాకపోవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినవస్తున్న ఓ అభిప్రాయం.
This post was last modified on May 9, 2022 3:08 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…