రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఆమె భర్తపై దాడికి దిగారు. అయితే, అత్యాచారానికి గురైన బాధితురాలి విషయంలో అన్నివర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతుండగా, ఏపీ హోంమంత్రి తానేటి వనిత చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అత్యాచారం ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులతో అప్పటికప్పుడు జరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు తెలుగు మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా ఏపీ హోంమంత్రి కామెంట్లపై నేషనల్ మీడియా సైతం దృష్టి సారించింది.
బాధిత మహిళ భర్త నుంచి డబ్బుల దొంగలించాలనే ఉద్దేశంతో వచ్చిన దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని, ఈ సంఘటన ప్రణాళికబద్దమైన విషయంగా చూడవద్దని సాక్షాత్తు హోంమంత్రి పేర్కొనడం సరికాదని పలు మీడియా సంస్థలు కామెంట్ చేశాయని తెలుగుదేశం నేతలు పేర్కొంటున్నారు. దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడటం వంటి అంశాలను చూస్తుంటే సంఘటనలో సైకలాజికల్ అంశాలు ప్రాధాన్యం పోషించిన విషయం అర్థమవుంతోదని మంత్రి పేర్కొనడం ఏంటని వారు విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించడంపై సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల విషయంలో శాంతిభద్రతల అంశంపై స్పందించాల్సింది పోయి
కాగా, రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి, భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి -భద్రతలు లేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో మహిళల పై రోజు రోజుకు పెరిగిపోతున్న అకృత్యాలలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఇదే సమయంలో #APWomenInsecured హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో కూడా ట్రెండ్ అయి దేశవ్యాప్తంగా 5 వ స్థానంలో నిలిచింది.
This post was last modified on May 5, 2022 8:18 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…