మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు వచ్చే వలసలదారులపై ట్రంప్ ఏప్రిల్ నుంచి 3 నెలల తాత్కాలిక నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో తాజాగా ఆ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకే ట్రంప్ హెచ్1-బీ, హెచ్-4 సహా అన్ని రకాల టెంపరరీ వర్క్ వీసాలపై నిషేధం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయంతో హెచ్1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చేందుకు అవసరమైన అన్నిరకాల వీసాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వర్క్ వీసాలపై నిషేధం జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. అయితే, ట్రంప్ నిర్ణయంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ట్రంప్ నిర్ణయంపై సుందర్ పిచాయ్ స్పందించారు. ఇమ్మిగ్రంట్ వీసాలపై ట్రంప్ తీరును సుందర్ పిచాయ్ తప్పుబట్టారు. అమెరికా ఆర్థిక రంగంలో సాధించిన విజయాల్లో ఇమ్మిగ్రేషన్ వీసాలు ఎంతగానో సహకరించాయని పిచాయ్ చెప్పారు.
ఇమ్మిగ్రెంట్ల సహకారం కూడా తోడవడంతోనే అమెరికా సాంకేతికపరంగా గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు. గూగుల్ సహా పలు దిగ్గజ సంస్థలు గొప్ప స్థానాల్లో ఉండడానికి ఇమ్మిగ్రేషన్ విధానం కారణమని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రకటనతో నిరుత్సాహపడ్డామని, తాము ఇమ్మిట్రంట్లను ప్రోత్సహిస్తూనే ఉంటామని, అర్హత ఉన్నవారందరికీ దేశంతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని ప్రకటించారు.
This post was last modified on June 23, 2020 6:59 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…