మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా తాజాగా సంచలన ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది. యాభై ఏళ్ల వయసులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా వ్యవహరిస్తున్న ఆయనతో సన్నిహితంగా ఉండే మహిళలకు సంబంధించిన ఫోటోలు కొన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటం.. రచ్చ చోటు చేసుకోవటం లాంటివి తెలిసిందే. తాజాగా నేపాల్ లో ఆయనో పబ్ లో ఉండటం కలకలం రేపితే.. ఆయన వెంట ఉన్న ఒక మహిళ ఉదంతం ఇప్పుడు మరింత షాకింగ్ గా మారింది.
అయితే.. పబ్ లో రాహుల్ వెంట ఉన్న మహిళ చైనా దౌత్యవేత్తగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇందులో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే సోషల్ మీడియాలో.. రాహుల్ పబ్ వీడియో బయటకు వచ్చినంతనే.. రాహుల్ ను హనీ ట్రాప్ లో పడేశారంటూ ఒకరు.. కాదు.. ఆమె రాహుల్ లవ్వర్ అని మరొకరు.. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు వ్యాఖ్యానించటం ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది.
రాహుల్ కు చెందిన పబ్ వీడియో బయటకు రాగానే బీజేపీ నాయకత్వం ఒక రేంజ్లో విరుచుకుపడుతుంటే.. కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడినట్లుచెబుతున్నారు. ఇప్పటికే సవాలచ్చ దరిద్రాలతో కిందా మీదా పడుతున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ రూపంలో ఎదురైన ఈ వ్యవహారం ఎక్కడకు తీసుకెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మరి.. దీనిపై రాహుల్ అండ్ కో ఎలాంటి వివరణ ఇస్తారన్నది ప్రశ్న. అన్నింటికి మించి పబ్ లో రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉన్న మహిళ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమెకు రాహుల్ కు మధ్యనున్నరిలేషన్ ఏమిటి? లాంటి అంశాలు ఇప్పుడు ప్రశ్నలుగా మారాయని చెప్పాలి.
This post was last modified on May 3, 2022 3:47 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…